By: ABP Desam | Updated at : 22 Mar 2023 07:30 PM (IST)
Edited By: jyothi
రైతులను ఆదుకుంటాం, సర్వే రిపోర్టు రాగానే పరిహారం అందజేస్తాం: మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli: ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గుర్తించి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శిస్తున్నారు. నేరుగా ఆయనే వెళ్లి ఎంత స్థాయిలో పంటనష్టం జరిగిందో అంచనా వేస్తున్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం, హరిపిరాల, కర్కాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఆయా చోట్ల ఆగి మరీ రైతులతో కాసేపు ముచ్చటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ... నష్టపోయిన రైతులను ఓదార్చారు. కచ్చితంగా నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే మంత్రిని చూడగానే పలువురు రైతులు బోరుమన్నారు. తమకు పరిహారం ఇప్పించాలి తీరాలనిని, తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన తమకు అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చిన మంత్రి ధైర్యాన్ని నింపుతూ భరోసానిస్తూ, అక్కున చేర్చుకున్నారు.
"ఇది రైతు ప్రభుత్వం. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ప్రభుత్వం. రైతులు నష్టపోకుండా చివరకు పంటలు కూడా కొనుగోలు చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్ తప్పకుండా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడాల్సిన పనిలేదు. వారికి అండగా ప్రభుత్వం ఉంటుంది. మేమంతా అన్నదాతలకు అండగా ఉంటాం... పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం" మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ నేతృత్వంలో గల ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రజా ప్రతినిధులను పంట నష్టాలను పరిశీలించాలని ఆదేశించారని ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ తమతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు. మంత్రితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.
ఇటీవల వరంగల్ లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా కేంద్రంలో రెండు మూడ్రోజుల నుంచి వర్షం కురుస్తోంది. అయితే అకాల వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల తదితర మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లి మరీ రైతులతో నేరుగా మాట్లాడుతున్నారు. జరిగిన నష్టాల గురించి తెలుసుకుంటూ పరామర్శిస్తూ ముందుకు వెళ్తున్నారు. తొర్రూరు మండలం మడిపల్లి, చందూర్ తండా, మాటేడు, పోలే పల్లి తదితర గ్రామాల్లో మామిడి తోటలు పూర్తిగా నాశనం అయ్యాయి. అలాగే ఇళ్లు కూలిపోయి.. నిరాశ్రయులుగా మారిన ప్రజలను కలిసి మంత్రి మాట్లాడారు. వడ్డే కొత్త పల్లి, పెద్ద వంగర, చిన్న వంగర, తదితర గ్రామాల్లోని ప్రజల బాగోగుల గురించి కూడా మంత్రి ఎర్రబెల్లి అడిగి తెలుసుకుంటున్నారు. నిన్ను రాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంట నష్టాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. మాటేడు వద్ద జొన్న చేలు లో మీడియాతో మాట్లాడారు.
TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆలోచన మారిందా?
Telangana Formation Day: రాదన్న తెలంగాణను సాధించిన ఘనుడు, పాలకుడిగా నిలిచిన కేసీఆర్- ట్విట్టర్‌లో ప్రశంసలు
Warangal News: పాలకుర్తిలో పండుగలా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?
BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!
Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ