By: ABP Desam | Updated at : 04 Jun 2023 10:38 PM (IST)
కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
Konda Murali Interesting Comments: ఒక్క ఆరు నెలలు కష్ట పడితే మా ప్రభుత్వం వస్తుందని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని కొండా మురళి వ్యాఖ్యానించారు. ఇక్కడ కొందరు నాయకులు పేదల జాగలు కబ్జా చేస్తున్నరు. యూపీ ముఖ్యమంత్రి అక్కడ బుల్డోజర్లతో కూలగొడుతుంటే, ఇక్కడ మేం యువతతో కబ్జా రాయుళ్ల ఇండ్లను కులగొట్టిస్తా అన్నారు. తాను ఎవరికి భయపడనని.. యువత గుర్తుపెట్టుకోండి మా కూతురు సుస్మిత మా ఇద్దరి కంటే ధైర్యవంతురాలు. సురేఖ, కొండా మురళి ఇద్దరిని కలిపితే చిట్టక్క అని అన్నారు.
అధికారం శాశ్వతం కాదు అని, 45 ఏళ్లుగా తాను ఇలాగే ఉన్నానన్నారు. తన బిడ్డ వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలని, ఆమె కష్టపడి పైకొచ్చిన వనిత అన్నారు. పులి కడుపున పుట్టిన బిడ్డ మా కూతురు. యువత అంత పులులే. ఒక్క ఆరు నెలలు కష్టపడండి. మన ప్రభుత్వం రాబోతోంది. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని గ్యారంటీగా చెబుతున్నా అన్నారు. తాను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారంటూ కొండా మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కాలు అటువంటిదని, తన లక్ అలా ఉంటుందని ఈ కిటుకు ఎవరికీ తెలియదన్నారు. అధిష్టానానికి ఈ విషయాలు చెప్పినా తాను పట్టించుకోను అన్నారు. తాను ఎక్కడికి పార్టీ మారానంటే, ఆ పార్టీ నేత సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.
మహబూబాబాద్ గడ్డ మీద రాళ్లు ఏసుకున్నాం, కాల్చుకున్నాం. కానీ చివరికి ఏమైంది, రావయ్యా అంటూ సీఎం కేసీఆర్ పిలిచారని గుర్తుచేసుకున్నారు. రేపు రేవంత్ రెడ్డి సీఎం అవుతారు. సురేఖకు మంత్రి పదవి వస్తుంది. మీ కష్టాలు తీరతాయి. కోవిడ్ సమయంలో రేషన్ డీలర్లను కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే వాళ్ల నాయకుడు దయాకర్ అలాంటి వ్యక్తి కనుక వీళ్లకు అదే బుద్ధులు వచ్చాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సెల్ ఫోన్ రూ.1400 దేనని, వరంగల్ జిల్లాలో రూ.18 వేలకు తొలి ఫోన్ కొన్నది తానేనన్నారు కొండా మురళి. సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లండి, నా ఐడెండిటీ కార్డు ఇస్తానని భరోసా ఇచ్చారు. యూపీ సీఎం బుల్డోజర్లతో నెట్టించా అంటున్నారు, తాను మాత్రం యువతతోనే ఆ పని చేయిస్తానన్నారు.
TS TET 2023 Results: టీఎస్ టెట్-2023 ఫలితాలు వచ్చేస్తున్నాయి, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు
AP ECET: ఏపీఈసెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
TS Ayush: తెలంగాణ ఆయుష్ విభాగంలో టీచింగ్ పోస్టులు, అర్హతలివే
Top Headlines Today: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య యూటర్న్- రికార్డుల వేటలో గిల్- మార్నింగ్ టాప్ టెన్ న్యూస్
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం
/body>