అన్వేషించండి

Local Body Elections: చిచ్చురేపుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు.. షెడ్యూల్ వస్తుందన్న పొంగులేటి, బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నిలదీత

Local body election in Telangana | తెలంగాణలో షెడ్యూల్ విడుదలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి. బీసీ రిజర్వేషన్లపై శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హింట్ ఇచ్చారు. జూన్ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు సంబంధించి సోమవారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ (Telangana Cabinet Meeting) సమావేశంలో చర్చించిన అనంతరం స్పష్టత వస్తుందన్నారు. 

కూసుమంచిలోనీ క్యాంప్ ఆఫీసులో పలు ప్రాంతాల నేతలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడుతూ.. మొదటగా జడ్పిటిసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి అన్నారు. తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.  

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండు వారాలే గడువు ఉందని, కాంగ్రెస్ శ్రేణులు గుర్తిస్తాయిలో సిద్ధం కావాలని సూచించారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుందన్నారు. ఎక్కడైనా చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అనేక కాంగ్రెస్ నేతలదే నని స్పష్టం చేశారు. వర్షాకాలం మొదలైందని, వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని తెలిపారు. సన్నాలకు బోనస్ రూ.500 సైతం త్వరలో అన్నదాతల ఖాతాల్లో జమ అవుతాయన్నారు.

బీసీ రిజర్వేషన్ లేకుండానే స్థానిక ఎన్నికలా?: శ్రీనివాస్ గౌడ్
కుల గణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడింది డ్రామాలేనని బీఆర్ఎస్ మండిపడుతోంది. బీసీ రిజర్వేషన్లపై తేల్చకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రానికి బిల్లులు పంపి, చేతులు దులుపుకోవడం కాదు, బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రాధాన్యత లేని పదవులు బీసీలకు కట్టబెడుతున్నారని, కులగణన లెక్కలతో ప్రయోజనం ఏముందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

కాగా, రెండు రోజుల కిందట తెలంగాణ మంత్రి సీతక్క స్థానిక ఎన్నికల షెడ్యూల్ వారంలో వస్తుందని వ్యాఖ్యానించారని ప్రచారం జరిగింది. అయితే తాను వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పలేదని, త్వరలో ఎన్నికలు వస్తాయని మాత్రమే చెప్పినట్లు తెలిపారు. తాను చేసినట్లు స్థానిక ఎన్నికల షెడ్యూల్ పై జరిగిన ప్రచారాన్ని ఖండించారు. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పక్షాలు సిద్ధంగా ఉండాలని, త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుందని సీతక్క అన్నారు. ఈ నెలాఖరులో స్థానిక ఎన్నికల షెడ్యూల్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు అమలు కోసం కుల గణన చేశామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, హడావుడిగా ఎన్నికలకు ఎందుకు వెళ్తుందని బీఆర్ఎస్ నిలదీస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy America Tour Cancelled: తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
తెలంగాణ సీఎం అమెరికా పర్యటన రద్దు! కేంద్రం నిరాకరించడానికి కారణం ఏంటి? రేవంత్ ఏమన్నారు? 
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget