Barrelakka: బర్రెలక్కకు ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? ఈసారి మరీ తక్కువ!
Telangana News: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆమెకు ఎంపీ ఎన్నికల్లో 3087 ఓట్లు వచ్చాయి.
Barrelakka Votes in Nagarkurnool: 2023 నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష అనే యువతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందే ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా బర్రెలక్క ఫేమస్ అయ్యారు. ఆ ఫేమ్ తో నామినేషన్ వేయడంతో మరింత సెన్సేషన్ ఆయ్యారు. సోషల్ మీడియాలో ఆమె గురించే చర్చ జరిగేది. మొత్తానికి నామమాత్రపు ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చాయి.
తాజాగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా బర్రెలక్క నామినేషన్ వేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కేవలం 3,087 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు ఆమెకు దాదాపు 5 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.
ఓ రీల్‌లో నిరుద్యోగుల వేదనను సరదాగా చెప్పడం ద్వారా అది వైరల్ అయి కర్నె శిరీష పాపులర్ అయ్యారు. ఆ రీల్‌తోనే ఆమె బర్రెలక్కగా పేరు పొందారు. ఆ పాపులారిటీతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి సోషల్ మీడియాలో సంచలనం అయ్యారు. తాను నిరుద్యోగుల తరపున పోరాడుతున్నా అంటూ విపరీతంగా బర్రెలక్క ప్రజల్లో తిరిగారు. అలా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు వస్తున్న ఆదరణతో పలువురు ప్రముఖులు సైతం బర్రెలక్కకు ఎన్నికల ప్రచారం కోసం డబ్బులు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేసి మూడు వేల ఓట్లు తెచ్చుకున్నారు.
View this post on Instagram
నాగర్ కర్నూలులో కాంగ్రెస్ విజయం
ఇక నాగర్ కర్నూలు ఎంపీ స్థానంలో కాంగ్రెస్ నేత మల్లు రవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 94,414 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన పోతుగంటి భరత్‌పై మల్లు రవి గెలిచారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ ఉనికి పూర్తిగా కోల్పోయింది. ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేస్తోంది.