అన్వేషించండి

Vande Bharat Train : 31 నుంచి బెంగళూరుకు కాచిగూడ నుంచి వందే భారత్ ట్రైన్ - నాలుగు గంటలు తగ్గనున్న ప్రయాణ సమయం !

కాచిగూడ - బెంగళూరు మధ్య వందే భారత్ ట్రైన్ 31వ తేదీన ప్రారంభం కానుంది. ఇప్పటిక్ ట్రైల్ రన్ పూర్తి అయింది.


Vande Bharat Train :    తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలు నడవనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు రెండు ఐటీ నగరాల మధ్య మూడో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది.  ఇప్పటికే ఈ రూట్‌కి సంబంధించి రూట్‌ మ్యాప్‌ ఖరారు అయిందని  రైల్వే వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటికే రైలు ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయింది.  

వరుసగా  వాయిదాలు

నిజానికి హైదరాబాద్ నుంచి మరో మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభించాలని గతంలో అనుకున్నారు. కానీ వాయిదాలు పడ్డాయి. గత ఆగస్టు పదిహేనో తేదీన  క చిగూడ-బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీస్ ఆగస్టు 15న ప్రారంభించాలని అనుకున్నారు. సాంకేతిక కారణాలతో చివరికి వాయిదా పడింది.  అయితే తాజాగా ఈ వందే భారత్ ప్రారంభంపై నిర్ణయానికి వచ్చారు.  రైల్వే అధికారులు ధరలను కూడా ఖరారు చేశారు. ఈ నెల 31న వందే భారత్ రైలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1545, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టిక్కెట్ ధర రూ. 2,050 

కాచిగూడ టు బెంగళూరు వందే భారత్ ట్రైన్‌లో టిక్కెట్ ధరాలను కూడా ఖరారు చేశారు.   వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1545, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టిక్కెట్ ధర రూ. 2,050 అవుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై రైల్వే అధికారులు అదికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  హైదరాబాద్ నంచి  బెంగళూరు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతూ ఉంటాయి. చాలా మంది రైలు టిక్కెట్లు దొరకక.. బస్సుల్లో వెళ్తూంటారు.                                  

ఆదా కానున్న నాలుగు గంటల ప్రయాణ సమయం 

కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు రెండు స్టేషన్ల మధ్య దాదాపు 618 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడున్నర గంటల్లో  చేరుకుంటుంది.  అంటే.. సాధారణ రైలుతో పోలిస్తే.. ప్రయాణ సమయం నాలుగైదు గంటలు తగ్గుతుంది. ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, షాద్ నగర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని తెలుస్తోంది.  హైదరాబాద్ మరియు బెంగళూరు మధ్య రెండు మార్గాల్లో అనేక రైళ్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు, ఒక మార్గం. మహబూబ్‌నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా మరో మార్గం. మరోవైపు, కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా రోజూ ఏడు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఈ రైళ్లు వారం రోజులు మరియు వారాంతాల్లో చాలా రద్దీగా ఉంటాయి.  అందుకే కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్‌ స్టేషన్‌ వరకు ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.                                           

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget