By: ABP Desam | Updated at : 12 May 2023 03:06 PM (IST)
తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - ఆ బియ్యం కొనుగోలుకు ఓకే !
Telangana News : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2021-22 రబీ పంట కాలానికి 15 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్‌ను తెలంగాణ రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. 2021-22 (రబీ), 2022-23 (ఖరీఫ్) పంట కాలాలకు సంబంధించి మొత్తం 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు, లక్ష్యానికి తగినట్లు-గా మిగిలిన బియ్యాన్ని రా రైస్ రూపంలో నిర్ధేశించిన గడువులోపు ఎఫ్‌సీఐకు అందజేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రైతులను దృష్టిలో ఉంచుకుని 2021-22 రబీ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి బియ్యం అందించటానికి ఉన్న గడువును ఇప్పటికే పలుమార్లు పెంచినప్పటికీ ఫలితం లేదని, చివరగా మరో అవకాశం ఇవ్వమని తాను చేసిన విజ్ఞప్తి మేరకు గడువును ఈనెల 31కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కనీస మద్దతు ధర చెల్లించి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభు త్వం అత్యధిక మొత్తంలో బియ్యాన్ని సేకరిస్తోందని చెప్పారు. పెరుగుతున్న సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని పదే పదే చెబుతున్నా ఆ దిశగా చర్యలు చేప ట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గడువు పెంచినా, గత సంవత్సరం రబీ పంట కాలానికి సంబంధిం చిన బియ్యాన్ని ఈ సంవత్సరం రబీ పంటకాలం పూర్తయినా అందించలేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వీటికి తోడు అక్కడక్కడ కొంతమంది మిల్లర్లు అడ్డదారిన స్లప చేస్తున్న రీసైకిల్డ్ బియ్యాన్ని అరికట్టడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. కనీసం ఇకనైనా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సమయానికి ధాన్యాన్ని సేకరించి, అందుకు తగినట్టు-గా మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకుని, రీసైకిల్డ్ బియ్యం సరఫ రాను అరికట్టి ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి సకాలంలో బియ్యాన్ని అందించడంలో నిర్ధిష్ట ప్రణాళికను రూపొందిం చుకొని రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కిషన్‌రెడ్డి తెలంగాణ సర్కారుకు సూచించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం , కేంద్రం మధ్య వివాదం ఏర్పడుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటోందని అందుకే తాము కూడా రైతుల వద్ద కొనుగోలు చేయడం లేదని గతంలో తెలంగాణ సర్కార్ ప్రకటించడం వివాదాస్పదమయింది. అయితే ప్రతి గింజనూ కేంద్రం కొనుగోలు చేస్తోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ వివాదానికి ఇప్పటికీ ముగింపు లేదు. అయితే ఈ సారి కేంద్రంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Group1: గ్రూప్-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!
Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!
SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?