అన్వేషించండి

Telangana Politics: కాంగ్రెస్ పెద్దలకు బీఆర్ఎస్ డబ్బుల మూటలు - బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Telangana News | కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తీ ఉందన్నారు.

Union Minister Bandi Sanjay News | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో దోస్తానా ఉంటే మీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని ఎవరైనా మీడియాతో మాట్లాడతారా? ఎవరితోనైనా ఫ్రెండ్ షిప్ ఉంటే  ఫోన్ లో మాట్లాడుకుంటారు కానీ మీడియాతో మాట్లాడరు అన్నారు. కేసీఆర్ కు, కాంగ్రెస్ పెద్దలతో దోస్తానా ఉంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకే చీకట్లో ఢిల్లీకి పోయారన్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని డబ్బు సంచులు ఇచ్చి వచ్చింది వాస్తవం కాదా? అని కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసులు విచారణకు రాకుండా ఢిల్లీ పెద్దల మందు సాగిలపడ్డది నిజం కాదా?’’ అంటూ బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయపడుతున్నారు అనే కేటీఆర్ ట్వీట్ కు అదే స్థాయిలో బదులిచ్చారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ మీడియా కేటీఆర్ చేసిన ట్వీట్ ను ప్రస్తావించగా తీవ్రంగా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. 

ఓటుకు నోటు కేసు ఎందుకు నీరుగార్చారు..

బీఆర్ఎస్ నేతల్ని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నది. ఆ కేసు ఎందుకు తేల్చలేకపోయారు? ఆ కేసును ఎందుకు మీరు నీరుగార్చారు? రేవంత్ తో దోస్తానా ఉన్నది బీఆర్ఎస్ కా ? బీజేపీకా ?. కేటీఆర్ అహంకారంవల్లే బీఆర్ఎస్ కి  రాష్ట్రంలో ఈ గతి పట్టింది. అయినా అహంకారం తగ్గలే. అందుకే బీఆర్ఎస్ (BRS Party) గ్రాఫ్ పెరిగే పరిస్తితి కనిపిస్తలేదు. బాధ భరించలేకే కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమై పండుకున్నడు. కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పూర్తిగా సర్వనాశననం అవుతుంది.

ఏదో ఒక పేపర్ చూసి కేటీఆర్ వాగడం కాదు. నిరుద్యోగులను లాఠీఛార్జ్ చేయించింది కేసీఆరే కదా... రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలను మీరు లాఠీలతో కొట్టించారు. ముందు ఈ విషయాలకు సమాధానం చెప్పు? అయ్యప్ప సొసైటీ విషయంలో పైసలు దండుకుంది మీరు కాదా? బీజేపీ నేతల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు.

మూసీలో మేం ఎందుకు ఉండాలి

మూసీ నది ప్రాంతంలో స్టే చేయడానికి మాకేం పనిలేదా? అని బండి సంజ్ మండిపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమయ్యాయి? ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ (KCR) పేరుంది. మాజీ సీఎం కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని అరెస్టైన వారు వాంగ్మూలం ఇచ్చారు. అయినా కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్లకు దమ్ముంటే కేసు సీబీఐకి అప్పగించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య మధ్య లాలూచీ లేకుండా సీబీఐకి కేసు అప్పగించాలి. ఒకవేళ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు డబ్బుల మూటలు ఇవ్వలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read: Bandi Sanjay Protest: గ్రూప్ 1 వివాదంపై రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ నిరసన, ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget