అన్వేషించండి

Telangana: గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు, టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం

TSPSC Group 1 Notification: తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Group 1 Notification: హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 503 పోస్టులతో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను సోమవారం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification) రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు అప్పటి కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల కొన్ని కొత్త పోస్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. 

రెండు సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదు. రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, భర్తీ ప్రక్రియ మాత్రం సజావుగా సాగలేదు. మొదట 2022 ఏప్రిల్ లో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కానీ ప్రిలిమ్స్ నిర్వహణ జరిగి, ఫలితాలు సైతం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారని అంతా అనుకుంటున్న సమయంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యిందని ఆరోపణలు రావడంతో మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేశారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ తొలిసారి రద్దయింది.

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించింది. తొలిసారి ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో బయోమెట్రిక్ లాంటి విషయాలతో పాటు ఎంతో జాగ్రత్తగా ఎగ్జామ్ నిర్వహించారు. కానీ రెండోసారి నిర్వహించిన ఎగ్జామ్ లలో అవకతవకలు జరిగాయని, నిబంధనలు సరిగ్గా పాటించలేదని గ్రూప్ 1 (Group 1) ప్రిలిమినరీ మరోసారి రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. విషయం హైకోర్టు వరకు వెళ్లడంతో ఎగ్జామ్ రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కేసు విచారణలో ఉండగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి 
టీఎస్ పీఎస్సీ చైర్మన్, ముగ్గురు సభ్యులు సైతం రాజీనామా చేయగా కొత్త ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసిన పిటిషన్‌ను టీఎస్ పీఎస్సీ సుప్రీంకోర్టులో వెనక్కి తీసుకుంది. కొత్తగా 60 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు కావడంతో కొత్త పోస్టులతో కలిపి టీఎస్‌పీఎస్సీ త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేయనుందని తెలుస్తోంది.

2022లో అక్టోబరు 16న తొలిసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో TSPSC ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత గత ఏడాది (2023) జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు సైతం విడుదల చేసింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా హైకోర్టు గతంలోనే రద్దు చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
KTR Complaints to Rahul Gandhi: రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget