అన్వేషించండి

Khammam MLC : ఖమ్మంలో వామపక్షాలతో టీఆర్ఎస్‌ దోస్తీ.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ !

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పూర్తి బలం ఉన్నప్పటికీ వామపక్షాలతో పొత్తు కోసం టీఆర్ఎస్ ట్రై చేస్తోంది. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు వామపక్షాలతో కలిసి నడవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కాలేదు. టీఆర్ఎస్ తరపున తాతా మధుసూదరావు పోటీ పడుతున్నారు. అనూహ్యంగా ఆయనకు అవకాశం దక్కింది. టీఆర్ఎస్‌కు కావాల్సినంత బలం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అధికారికంగానే పూర్తి బలం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 769 ఓట్లు ఉండగా అందులో టీఆర్‌ఎస్‌ పార్టీకి అధికారికంగా 497 ఓట్లు ఉన్నాయి. ఇతర పార్టీల వారు అనేక మంది టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీకి చెందిన 19, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన 75 మంది టీఆర్‌ఎస్‌ పార్టీలోనే చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌పార్టీకి సరాసరిగా 600 వరకు ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే. 

Also Read : కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..

అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పుడు వామపక్షాల ఓట్లపై కన్నేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండటంతో వామపక్షాల ఓట్లపై టీఆర్‌ఎస్‌ కన్నేసింది. సీపీఎం పార్టీకి 26 ఓట్లు, సీపీఐ పార్టీకి 34 ఓట్లు, న్యూడెమోక్రసీకి ఒక ఓటు ఉన్నాయి. వీరందర్నీ టీఆర్ఎస్‌ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. 

Also Read:  ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ మాత్రం రెండు ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే టీఆర్ఎస్ ఒక్కొక్క స్థానానికే పరిమితం అయింది. వలసలతో టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉనప్పటికీ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌కు తిరుగులేదు. కాంగ్రెస్‌ పార్టీకి ఓట్ల రూపంలో బలం చేకూరకుండా ఉండేందుకు, భవిష్యత్‌లో వామపక్షాలతో దోస్తీ దిశగా అడుగులు వేసేందుకు టీఆర్ఎస్ ఇప్పుడు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగానే సునాయాసంగా గెలుస్తారనే విషయం తెలిసినప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సీపీఐ పార్టీకి స్నేహహస్తం అందించారని భావిస్తున్నారు. 

Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?

భవిష్యత్‌లో సీపీఐ పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు ఉంటుందనే ప్రచారం సాగుతోంది.  ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ అడుగులు కనిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో బలంగా ఉన్న మరో వామపక్ష పార్టీ సీపీఎంను సైతం మద్దతు అడుగుతారా..? లేదా..? అనేది వేచిచూడాల్సిందే. ఏది ఏమైనా కాంగ్రెస్‌ పార్టీకి బలమైన జిల్లాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీని దెబ్బతీసే దిశగా టీఆర్‌ఎస్‌ పార్టీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఈడీ దూకుడు.. రూ. 144 కోట్ల ఆస్తుల జప్తు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget