అన్వేషించండి

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు.. నేడు ప్రకటించే ఛాన్స్!

అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు పూర్తి బలం ఉన్నందున.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 6 స్థానాలను ఆ పార్టీకే దక్కనున్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థుల ఖరారుపై ఆ పార్టీ ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. అశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నందున, గతంలో ఇచ్చిన హామీతో పాటు, సామాజిక, రాజకీయ సమీకరణలను కూడా అభ్యర్థుల ఎంపిక కోసం కుస్తీ పడుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో (నవంబరు 16) నామినేషన్లు ముగియనున్నాయి. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

అయితే, అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు పూర్తి బలం ఉన్నందున.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 6 స్థానాలను ఆ పార్టీకే దక్కనున్నాయి. సునాయాసంగా మండలిలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఎమ్మెల్యే కోటా టికెట్ కోసం తాజా మాజీలతో పాటు.. చాలా మంది నేతలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మధుసూదనచారి, కడియం శ్రీహరి, ఎర్రోళ్ల శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎల్.రమణ పేర్లు కూడా ఈ ప్రచారంలో ఉన్నాయి.

Also Read: AP Municipal Elections: ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల ఎన్నికలు ప్రారంభం..

గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమే అయినప్పటికీ.. ఏ కోటాలో అవకాశం ఇస్తారనేది మాత్రం స్పష్టత లేదు. సుఖేందర్ రెడ్డి, ఎల్.రమణకు గవర్నర్ కోటా లేదా స్థానిక సంస్థల కోటాలో మండలికి పంపించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. నేడు అభ్యర్థులను ప్రకటిస్తే.. ఈరోజే కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. 

Also Read: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇలా.. 

మరోవైపు, స్థానిక సంస్థల కోటాలో నవంబరు 16 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల అభ్యర్థులపై కూడా టీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థులతో పాటు స్థానిక సంస్థల కోటా అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలా లేక రెండు మూడు రోజులు ఆగి ప్రకటించాలా అనే తర్జనభర్జన కొనసాగుతోంది. కల్వకుంట్ల కవిత, బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన పురాణం సతీష్ కుమార్, తేరా చిన్నపరెడ్డి, భూపాల్ రెడ్డి, భానుప్రసాదరావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. అందరూ మరోసారి కొనసాగాలని ఆశిస్తున్నారు.

Also Read: ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఇలా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget