అన్వేషించండి

Kummera Jathara Tragedy: కుమ్మెర జాతర గొడవలో 2 చిన్నారి మృతిపై కేసు నమోదు- అసలు వివాదం ఏంటీ?

కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన తోపులాటలో చిన్నారి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు హామీ ఇచ్చారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో జరిగిన గొడవ కారణంగా రెండు నెలల చిన్నారి చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జాతరకు వెళ్లిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడి జరగడం, తోపులాటలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డుపై 5 గంటలపాటు రాస్తారోకో చేయగా.. చివరకు డీఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబం ఆందోళన విరమించింది.

వివాదానికి కారణమైన టికెట్ ధర
కుమ్మెర గ్రామానికి చెందిన గణేశ్, తన భార్య మౌనిక, రెండు నెలల కుమార్తె, బంధువు చంద్రకళతో కలిసి ఈ నెల 18న మల్లన్న జాతరకు వెళ్లారు. బుధవారం రాత్రి దైవదర్శనం కోసం గణేష్ కుటుంబం వెళ్తుండగా, టికెట్ ధర విషయంలో ఆలయ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి, భక్తురాలు చంద్రకళకు మధ్య వివాదం తలెత్తింది. రూ.100 చెల్లించాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయగా.. తాము మాత్రమే ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులకు, గణేశ్‌ కుటుంబానికి మధ్య గొడవ జరగగా, అది తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలో మౌనిక తన చిన్నారితో సహా కిందపడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన శిశువును ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ నెలల చిన్నారి శనివారం మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

కేసు నమోదు చేసిన పోలీసులు
చనిపోయిన చిన్నారి తల్లి మౌనిక ఫిర్యాదు మేరకు ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని, రిపోర్టు ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పోలీసులు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం చేయడం లేదని బాధితులు ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

Kummera Jathara Tragedy: కుమ్మెర జాతర గొడవలో 2 చిన్నారి మృతిపై కేసు నమోదు- అసలు వివాదం ఏంటీ?

చిన్నారి మృతిపై నాగర్‌కర్నూల్‌లో 5 గంటల పాటు రాస్తారోకో
కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో జరిగిన దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితులతో కలిసి వివిధ ప్రజాసంఘాలు శనివారం రాత్రి నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై భారీ ఆందోళన చేపట్టాయి. ఈ నిరసన కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బాధితులకు మద్దతుగా BSP, DSP, BC-SC-ST-JAC, MRPS మరియు ఇతర సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Kummera Jathara Tragedy: కుమ్మెర జాతర గొడవలో 2 చిన్నారి మృతిపై కేసు నమోదు- అసలు వివాదం ఏంటీ?

పోలీసుల హామీతో ఆందోళన విరమణ
సుమారు 5 గంటల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్తతను తగ్గించేందుకు నాగర్‌కర్నూలు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. డీఎస్పీ భరోసాతో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో విశారదన్ మహరాజ్ సభ్యులు, బాధిత కుటుంబానికి చెందిన వారు ధర్నా విరమించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget