(Source: ECI/ABP News/ABP Majha)
Top Headlines Today: విజయసాయి రెడ్డిపై సీజేఐకు పురంధేశ్వరి ఫిర్యాదు- కోనాయిపల్లిలో నామినేషన్ పత్రాలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు
Top 5 Telugu Headlines Today 4 November 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Telugu Headlines Today 4 November 2023
చంద్రబాబు కంటికి మంగళవారం ఆపరేషన్ - ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో టెస్టులు !
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ మంగళవారం నిర్వహించే అవకాశం ఉంది. ముందస్తు పరీక్షల కోసం ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్‌కు టీడీపీ చీఫ్ వెళ్లారు. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆపరేషన్ తేదీనిఖరారు చేస్తారు. మగళవారం చేయవచ్చని చెబుతున్నారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే డాక్టర్లు సూచించారు. రెండు రోజుల పాటు ఏఐజీ ఆస్పత్రిలో టీడీపీ చీఫ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జూన్‌లో ఎడమ కంటికి చంద్రబాబు సర్జరీ చేయించుకున్నారు. కుడి కంటికి చేయించుకోవాల్సి ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎంపీ విజయసాయి రెడ్డిపై సీజేఐకు పురంధేశ్వరి ఫిర్యాదు - బెయిల్ షరతులు ఉల్లంఘించారని లేఖ
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పదేళ్లుగా బెయిల్ పై ఉంటూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో షరతులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులున్నాయని లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని, బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు లేఖతో పాటు 5 దస్త్రాలను జత చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కోనాయిపల్లి వెంకటేశుని దర్శించిన సీఎం కేసీఆర్ - నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలోని వెంకటేశ్వర ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. నామినేషన్ పత్రాలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, ప్రతిసారి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నామినేషన్ వేయడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని వెంకటేశుని దర్శించి, నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పోరాడమని పదవులిస్తే పార్టీ మారిపోయారు - తెలంగాణ బీజేపీకి కొత్త కష్టం తెచ్చిన సీనియర్లు !
తెలంగాణ బీజేపీని సమస్యల మీద సమస్యలు వెంటాడుతున్నాయి. పార్టీలో సీనియర్లు అందర్నీ ఎన్నికల్లో భాగం చేయడానికి రకరకాల కమిటీలు వేసి పనులు అప్పగిస్తే వారంతా పార్టీ ఫిరాయించేశారు. మరికొంత మంది సైలెంట్ అయ్యారు. దీంతో అభ్యర్థుల ఎంపిక సహా ఏ పనీ ముందుకు సాగడం లేదు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో భాగంగా బీజేపీ హైకమాండ్ 14 కమిటీలు నియమించింది. వీరిలో ఒక్కరు కూడా యాక్టివ్ గా పని చేయడం లేదు. కొంత మంది నేరుగా పార్టీ మారిపోయారు. మ్యానిఫెస్టో, స్క్రీనింగ్ కమిటీల చైర్మెన్లు, ఎలక్షన్స్ ఇష్యూస్ కమిటీ కన్వీనర్ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారు - ఆ సీటుతో పాటు మరో ఆఫర్
రాష్ట్రంలో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారైంది. సీపీఐకి కొత్తగూడెం సీటు, మరో ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే, మునుగోడులో పోటీ వద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించగా, మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీపీఎంతో పొత్తుపైనా సీపీఐ నేతలు ప్రస్తావించారు. ఖమ్మం జిల్లాలో ఓ సీటును సీపీఎంకు కేటాయించాలని సీపీఐ నేతలు సూచించగా, కాంగ్రెస్ అధిష్ఠానం దీనిపై సీపీఎంతో చర్చిస్తున్నారని రేవంత్ తెలిపారు. అంతకు ముందు పొత్తుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మునుగోడు టికెట్ సీపీఐకి కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి