Top 5 Headlines Today: కిడ్నాప్ ఎపిసోడ్‌పై సీబీఐ విచారణ జరగాలన్న విశాఖ ఎంపీ! హైదరాబాద్‌లో కోమటిరెడ్డితో రేవంత్ భేటీ!
Top 5 Telugu Headlines Today 21 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
కిడ్నాప్ ఎపిసోడ్‌పై సీబీఐ విచారణ జరగాలి- విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ డిమాండ్
ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో కిడ్నాప్ ఎపిసోడ్ ఇంకా ట్రెండింగ్‌లో ఉంది. ప్రతిపక్షాలు దీనిపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్‌కు ఆయన కూడా స్వరం కలిపారు. ఎంటైర్ కిడ్నాప్ ఎపిసోడ్ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. విశాఖలో ప్రెస్‌మీట్ పెట్టిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే కిడ్నాపర్లు ఇంట్లో ప్రవేశించిన నాటి నుంచి బయటకు వెళ్ళే వరకూ అన్ని బయటికి వస్తాయన్నారు. ఎర్ర గంగిరెడ్డితో తనకు లావా దేవీలు ఉన్నాయని చెప్పడం బాధగా ఉందన్నారు. వెయ్యి కోట్లు రూపాయలు లావా దేవీలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారని.. అసలు తన ఆస్తి మొత్తమే అంత ఉండబోదన్నారు. పూర్తి వివరాలు
ఏపీలోని వార్డు, గ్రామ సచివాలయాల్లో క్యాంపులు- జులై ఒకటి నుంచి ఫ్రీగా 11 సర్టిఫికెట్స్ అందజేత
ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే జగనన్నకు చెబుదాం ప్రోగ్రామ్‌తో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తోంది. వాటికి సంబంధిత శాఖలు రియాక్ట్ అవుతున్నాయి. దీనికి అనుబంధంగా జగనన్న సురక్ష అనే మరో కార్యక్రమం చేపట్టింది. జూన్ 23 నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం సిబ్బందితోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ప్రయత్నాలు చేస్తోంది. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయబోతోంది. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి స్టార్ట్ చేయనుంది. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయడమే ఈ శిబిరాల లక్ష్యం. స్పాట్‌లోనే సర్టిఫికేట్స్ ఇచ్చే కార్యక్రమం నెల రోజుల పాటు సాగనుంది. పూర్తి వివరాలు
కోమటి రెడ్డితో కలిసి పొంగులేటి, జూపల్లి ఇంటికి రేవంత్- అనంతరం ఢిల్లీకి పయనం
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి జూపల్లి, పొంగలేటి నివాసాలకు వెళ్లి సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని వారి వారి నివాసాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. అత్తపూర్‌లో ఉన్న జూపల్లి కృష్ణారావు ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ ఆయన్ని పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నారు. పూర్తి వివరాలు
కామినేని ఆస్పత్రి ఛైర్మన్, ఎండీ నివాసాల్లో ఈడీ సోదాలు - ఎస్వీఎస్ వైద్య కళాశాలలోనూ తనిఖీలు
తెలంగాణలో మరోసారి ఎన్‌ఫోర్స్ మెంట్ దాడులు సంచలనం సృష్టించాయి. తాజాగా కామినేని ఆస్పత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ‌్రీధర్ నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవలం ఇళ్లలోనే కాకుండా కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో కూడా ఈడి అధికారుల సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ తనిఖీలు సాగుతున్నాయి. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. మెడికల్ కళాశాలతోపాటు యాజమాన్యం ఆస్తులపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు
కోమటిరెడ్డితో రేవంత్ భేటీ - పార్టీలో చేరికలపై భిన్నాభిప్రాయాలు లేవన్న నేతలు !
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి .. హైదరబాద్‌లోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లారు. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను లాంఛనంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి వెళ్లాలనుకున్నారు. అయితే ఇతర సీనియర్ నేతలందరితో కలిసి వెళ్లి ఆహ్వానిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనతో మాట్లాడి ఇద్దరూ కలిసి ఇతర నేతలతో పాటుగా జూపల్లి నివాసానికి వెళ్లారు. పూర్తి వివరాలు