Top Headlines Today: గుంటూరు వైసీపీలో సీట్ల పంచాయితీ- మంత్రి గంగుల ఫ్యామిలీకి ఈడీ నోటీసులు
Top 5 Telugu Headlines Today 05 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

మంత్రి గంగులకు షాక్, ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈడీ నోటీసులు
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు గానూ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. గంగుల కుటుంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానెట్స్ ఫెమా నిబంధలు ఉల్లంఘించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. గత ఏడాది నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీస్‌లో సోదాలు నిర్వహించింది కూడా. చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయటంలో అక్రమాలు జరిగినట్టు ఈడీ తేల్చింది. పూర్తి వివరాలు
గుంటూరు వైసీపీలో సీట్ల పంచాయితీ- మద్దాలి గిరికి ఈసారి టికెట్ అనుమానమే!
గుంటూరు అధికార పార్టీలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే మద్దాల గిరికి ఈసారి సీటు కేటాయింపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. ఇందులో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్ది ముస్తాఫా విజయం సాధించారు. పశ్చిమంలో అయితే తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలి గిరి, ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పూర్తి వివరాలు
47పార్టీలకు ఎమ్మెల్యే కవిత లేఖ-మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై గట్టిగా పట్టుబడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అయినా... మహిళా బిల్లును ఆమోదించాలి డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అయినా మహిళా బిల్లును ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని రాజకీయ పార్టీలను కోరారామె. పూర్తి వివరాలు
హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం సూచన- అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచన
ప్రజలు అత్యవసరమైతేనే తప్పా బయటకు రావొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. భారీ వర్షాల వేళ జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, హైదరాబాద్ కలెక్టర్‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చెట్లు, కొమ్మలు, కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలు
పాలన చేతకాకే విద్యుత్ కోతలు - ఏపీ సర్కార్‌పై పురంధేశ్వరి ఆగ్రహం !
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతల పై భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆమె పరిశ్రమలకు విద్యుత్ సరఫరా లో ఆటంకాలు పై ఆమె మండిపడ్డారు.. పరిశ్రమల విద్యుత్ వాడకం పై ప్రభుత్వం 30శాతం కుదించడాన్ని ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు విద్యుత్ వాడకం పై ఆంక్షలు విధించడం సరైన పద్దతి కాదని తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ లు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేయటం ఏంటని ప్రశ్నించారు. పూర్తి వివరాలు





















