TS News Developments Today: బైంసాలో బీజేపీ బహిరంగసభ నేడు, హాజరుకానున్న కేంద్రమంత్రి
సోమవారం సంజయ్ పాదయాత్రకు షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు. భైంసా వెళ్లకూడదని, సభను కూడా భైంసా టౌను 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని చెప్పింది.
నేడు బైంసాలో బీజేపీ బహిరంగసభ
బండి సంజయ్ పాదయాత్ర ఐదోవిడత ప్రారంభ బహిరంగసభ వేదిక మారింది. బైంసా సమీపంలోని మూడు కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ రోజు సభ నిర్వహించనున్నారు. సోమవారం సంజయ్ పాదయాత్రకు షరతులతో అనుమతి ఇచ్చింది హైకోర్టు. భైంసా వెళ్లకూడదని, సభను కూడా భైంసా టౌను 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని చెప్పింది. 500 మందితో పాదయాత్ర, 3 వేల మందితో సభ జరుపుకోవాలి ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే మీటింగ్ పెట్టుకోవాలని సూచించింది. ఇతర మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని .. అలాగే కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు సూచనల మేరకు సభాస్థలిని మార్చింది. బీజేపీ. మొదటి షెడ్యూల్ ప్రకారం భైంసా బైపాస్ రోడ్డు దగ్గర సభకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వేదిక భైంసాకు 2. 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే 3 కిలోమీటర్ల దూరంలో ఉండే స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ బహిరంగసభకు ముఖ్యఅతిథిగా కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.
నేటితో హైదరాబాద్ మెట్రోకు ఐదేళ్లు
హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలు ప్రారంభమై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఐదవ వార్షికోత్సవ వేడుకలు. అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి, సీసీఓ కేవీబీ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో నేతల పర్యటనలు
నేడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నారు.
నేడు భీంగల్ లో ఎంపీ అరవింద్ పర్యటన. జనంతోనే మనం కార్యక్రమo పేరుతో బాల్కొండ నియోజకవర్గ నేత మల్లిఖార్జున్ రెడ్డి 10 రోజుల పాటు చేసిన పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొననున్న ఎంపీ అరవింద్.
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
రాష్ట్రవ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి మంచుదుప్పటి కమ్మేస్తుంది. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రంభీం జిల్లాలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్(యూ)లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్ డీపీఎస్ తెలిపింది. తిర్యాని 9.3, వాంకిడిలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.వివిధ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రతతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. పలుచోట్ల పొగమంచు పేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
నేటి నుంచి జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్
జేఎన్‌టీయుహెచ్ పరిధిలోని అన్ని అనుబంధ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని వర్సిటీ అధికారులు మరోసారి ఆదేశాలు జారీ చేశారు. గతంలోనే కళాశాలలకు అధికారులు ఆదేశాలు ఇచ్చినా మళ్లి తాజాగా రెండో సారి కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కేవలం ఆదేశాలు ఇవ్వడమే కానీ దాని అమలు విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి.కాలేజీల్లో బయోమెట్రిక్ పకడ్బందీగా అమలుకు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.సంతోష్ కుమార్ ఆరోపించారు. కాగితాలపై కాకుండా ప్రత్యక్షంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సాంకేతిక విద్య బలోపేతం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నేటి నుంచి డిగ్రీ స్పాట్ అడ్మీషన్స్
తెలంగాణాలోని దోస్త్ పరిధిలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో మూడో విడత స్పాట్ అడ్మషన్స్ ఈ రోజు నుంచి ప్రారంభం. ఈ దోస్త్ ద్వారా స్పాట్ అడ్మిషన్స్ పొందే విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్ మెంట్ పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
నేడు కంటివెలుగుపై మంత్రి హరీష్ రావు ఉన్నతస్థాయి సమీక్ష
జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పథక అమలుపై ఆరోగ్యశాఖామంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఎంసిహెచ్ఆర్డీ లో జరిగే సమీక్షా సమావేశంలో అన్నీ జిల్లాలకు చెందిన వైద్యశాఖా అధికారులు పాల్గొంటారు.
వరంగల్ లో ఈరోజు నుంచి దీక్షా దివస్ కార్యక్రమాలు
ఉదయం 10 గంటలకు కాళోజీ జంక్షన్‌లో దీక్షా దివస్ కార్యక్రమం.30న సాయంత్రం 5 గంటలకు జయశంకర్ పార్కు నుంచి అమరవీరుల స్థూపం వరకు క్యాండిల్ ర్యాలీ. డిసెంబరు 1న ఉదయం 10 గంటలకు వరంగల్ కార్పొరేషన్ స్ఫూర్తి చిహ్నం నుంచి అమరవీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ. 2న ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్‌లో ఫొటో ఎగ్జిబిషన్. 3న టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు అమరవీరుల సంస్మరణ సభ.. అదే రోజు 11 గంటలకు మైనార్టీల సంక్షేమంపై కార్యక్రమం. 4న సాయంత్రం 5 గంటలకు ఉద్యమకారులు, కవులు, కళాకారులకు కాజీపేటలో సత్కారం. 5న ఉదయం 10 గంటలకు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం అభిరామ్ గార్డెన్స్‌లో.. 6 ఉదయం 10 గంటలకు మున్సిపల్ గెస్ట్‌హౌజ్‌లో ‘అంబేద్కర్ ఆలోచన-కేసీఆర్ ఆచరణ’ పేరిట కార్యక్రమం. 7న విద్యార్థి, యువజన ఉద్యమకారుల అలాయ్ బలాయ్ కార్యక్రమం. 8న ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్‌లలో జెండావిష్కరణలు. 9న దీక్షా దివస్ ముగింపు (పునరంకిత) సభ.