అన్వేషించండి

తెలంగాణలోని ఇవాళ్టి మెయిన్ అప్‌డేట్స్ ఇవే

ఇప్పటికే 2 రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ..ఇవాళ మళ్లీ రావాలని ఆదేశించింది ఈడీ. నందకుమార్‌ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..!

ఇవాళ ఈడీ విచారణకు ఎమ్యెల్యే రోహిత్ రెడ్డి

ఎమ్మెల్యేలకు ఎర కేసులో రోహిత్‌రెడ్డి ఈడీ విచారణపై సస్సెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్‌ని ప్రశ్నించింది ఈడీ. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు రోహిత్‌రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని సీబీఐకి కేసు విచారణ అప్పగించడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఆయన.. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలా..? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా..? అనేది నిర్ణయించుకుంటామన్నారు. కేసును సీబీఐకి బదిలీ చేయడంపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు వెల్లడించారు.

మాణిక్‌చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్ అభిషేక్‌ను ఇప్పటికే విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. A2గా ఉన్న నందకుమార్‌ను ఇవాళ కూడా ప్రశ్నించనుంది ఈడీ. అసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో ముగ్గురు అధికారులతో కూడిన బృందం నందకుమార్ నుంచి ఇప్పటికే స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఈడీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు..! తనను దోషిగా చూపేందుకు మాస్టర్ ప్లాన్ వేశారన్నది ఆయన వర్షన్.

ఇప్పటికే 2 రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ..ఇవాళ మళ్లీ రావాలని ఆదేశించింది ఈడీ. నందకుమార్‌ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..! మరి రేపు రోహిత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది..? ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నందకుమార్ మరో ఆరోపణ

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ మరోసారి నందకుమార్‌ని ఈడీ విచారించనుంది. సోమవారం చంచల్‌గూడ జైలులో 4గంటల పాటు నందు విచారణ సాగింది. విచారణలో నందకుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ.. ఇవాళ మరోసారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది. ఇవాళ విచారణ అనంతరం కోర్టులో నివేదిక సమర్పించనుంది ఈడీ. నందుపై ఉన్న కేసుల వివరాలు సేకరించగా.. ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది.

బంజారాహిల్స్​లోని ఓ భూ వ్యవహరంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్.. భూమిని కాజేయాలని యజమానిని వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. దీని ఆధారంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద నిందితుడిపై ఈడీ కేసు నమోదు చేసింది.

రామప్పలో రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శనకు విచ్చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఏఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకేన్, అదనపు కలెక్టర్ వైవి గణేష్‌తో కలిసి రామప్పలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  రాష్ట్రపతి పర్యటనకు రామప్ప దేవాలయం సుందరీకరణతో అలంకరణ పూర్తి చేసామని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందని.. ఈ క్రమంలోనే బార్కెట్లు, పార్కింగ్ ఏరియా వంటి వివరాలు వెల్లడించారు.

ప్రసాద్ స్కీమ్ పైలెట్ ప్రాజెక్టు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం పైలెట్ ప్రాజెక్టు రామప్పలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారని వివరించారు. ఈనెల 28న రాష్ట్రపతి రామప్ప రానుండగా.. ములుగు గిరిజన జిల్లా అయినందున ఆదివాసీ కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లలో నిమగ్నమైన అన్ని శాఖల అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన వివరాలు చెప్పారు. రామప్ప గార్డెన్ అందంగా తీర్చిదిద్దినట్లు, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రామప్ప ప్రాంగణం అంతా శానిటైజ చేశామన్నారు. కీటకాలు ప్రవేశించకుండా బ్లీచింగ్ కూడా చేసినట్లు కలెక్టర్ వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా రామప్ప పరిసర ప్రాంతాలన్నింటిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.


రైతుబంధు కు ఏర్పాట్లు పూర్తి

యాసంగికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం బుధవారం నుంచి రైతులకు అందనున్నది. ఆ రోజు ఉదయం నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పైసలు జమ కానున్నాయి. ఈ సీజన్‌లో సుమారు 66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.7,600 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. రైతుబంధుకు అవసరమైన నిధులను సిద్ధం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా చివరి రైతు వరకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఆర్థికశాఖల అధికారులు పెట్టుబడి సాయం పంపిణీపై పకడ్బందీ చర్యలు తీసుకొన్నారు. గత వానకాలం సీజన్‌లోనే రూ.50 వేల కోట్ల మార్క్‌ను దాటిన రైతుబంధు సాయం.. ఈ సీజన్‌తో రూ.65 వేల కోట్లకు చేరుతుంది.


గెజిటెడ్‌ పోస్టుల దరఖాస్తులకు నేడే ఆఖరు

భూగర్భ జలవనరుల శాఖలో 32 గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నది. 25 నాన్‌గెజిటెడ్‌ పోస్టులకు మాత్రం బుధవారం వరకు చాన్స్‌ ఉన్నది. రాష్ట్రంలోని భూగర్భ జల వనరుల శాఖలో 57 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది నవంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. వివరాలకు https://www.tspsc. gov.inలో సంప్రదించవచ్చును.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget