అన్వేషించండి

TS News Developments Today: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ రెడీ, నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి - అక్కడ రాజశ్యామల యాగం

సిబిఐ నుంచి నోటీసులు అందుకొని విచారణ, ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఎక్కడ నుంచున్నా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని కవిత పేర్కొన్న నేపథ్యంలో ఇవాళ జరిగే తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ సమావేశం కీలకంగామారనుంది.

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ సిద్ధం.. నేడు ఢిల్లీ కి ముఖ్యమంత్రి కేసీఆర్‌.

ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్‌పటేల్‌ మార్గ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్టు సమాచారం. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 

ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత. 

ఎమ్మెల్సీ కవిత  అధ్యక్షతన  ఈ రోజు తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ  సమావేశం ముషీరాబాద్ లోని మహ్మదీయ మాన్షన్ లో జరగనుంది.  ఈ సమావేశానికి జిల్లాల కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ సభ్యులు పాల్గొంటారు. ఇటీవల సిబిఐ నుంచి నోటీసులు అందుకొని విచారణ హాజరుకావడం, అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ ను ఎక్కడ నుంచున్నా వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని కవిత పేర్కొన్న నేపథ్యంలో ఇవాళ జరిగే తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ  సమావేశం కీలకంగామారనుంది. నేతలకు ఎమ్మెల్సీ కవిత ఏం దిశా, నిర్దేశం చేస్తారోనని ఆసక్తిగా మారింది. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ మరో షాకిచ్చింది. 91 సీఆర్పీసీ కింద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. దీంతో త్వరలోనే కవితను సీబీఐ విచారించనున్నట్లు తెలుస్తోంది. తాము చెప్పిన చోట, నోటీసు అందుకున్న వ్యక్తి హాజరుకావాలని .. అడిగిన పత్రాలు, ఆధారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. తేదీ, స్థలం వివరాల గురించి త్వరలోనే మెయిల్ ద్వారా వెల్లడిస్తామని సీబీఐ పేర్కొంది.

తెలంగాణపైనా మాండూస్ ఎఫెక్ట్: జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

మాండూస్ తుపాను ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు తెలంగాణపైనా పడింది. దీంతో రాజధాని హైదరాబాద్ సహా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. రాష్ట్రంలో ముసురు వాతావరణం ఏర్పడింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్, లక్డీకపూల్, ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో వాహనదారులు, ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరో 12 గంటలు అలర్ట్

తుపాను మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తున్నాయి. ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగిస్తున్నారు. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు అంటే డిసెంబర్ 14 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ తోపాటు జిల్లాలో  అర్ధరాత్రి నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. వాతావరణ కూడా ముసురులా పట్టినట్లుంది.

ఉమ్మడి వరంగల్ ఏజెన్సీలోకి మావోయిస్టు యాక్షన్ టీంలు ?

మూలుగు ,భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి యాక్షన్‌ టీంలు ఎంట్రీ ఇచ్చాయనే సమాచారంతో ఆ ప్రాంతంలోని పోలీసులను అలర్ట్‌ చేశారు. ఇప్పటికే ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్‌, మహాముత్తారం, భూపాలపల్లి అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బలగాలతో పాటు డ్రోన్‌ కెమెరాలతో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. అడవుల్లో ఎక్కడ దాగి ఉన్నా కనిపెట్టేలా ఎక్కువ మెగాపిక్సల్‌ డ్రోన్‌ కెమెరాలను సైతం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల హెచ్చరికలతో పాటు స్పెషల్‌ పార్టీ బలగాల కూంబింగ్‌లతో అటవీ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌ స్ తోపాటు ములుగు జిల్లాలోని సమ్మక్క బ్యారేజీ వద్ద పోలీసుల బందోబస్తును పెంచారు.

హిట్ లిస్ట్ లో ఉన్న లీడర్స్ తస్మాత్ జాగ్రత!

మావోయిస్టు యాక్షన్‌టీంలు జిల్లాల్లో ప్రవేశించాయని జరుగుతున్న ప్రచారానికి తోడు పోలీసుల హెచ్చరికలు నేతలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల పోలీసులు ఇప్పటికే అధికార పార్టీ నాయకులను, మావోయిస్టు టార్గెట్‌లను అప్రమత్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లో గ్రామాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్‌లను సైతం స్థానికంగా ఉండకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అనుమానితులు గ్రామంలో ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ప్రజలు అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget