News
News
X

TS News Developments Today: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ టూర్, వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఐదో రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముథోల్ మరియు నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు.

FOLLOW US: 
Share:

నేడు హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ టూర్
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఈ రోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటిఆర్ పాల్గొంటారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో రూ. 28 కోట్ల 51 లక్షల వ్యయంతో చేపట్టిన 7 అభివృద్ధి  పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.ఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ని ఓల్డ్ బోయినపల్లి వద్ద వార్డు నంబర్ 19 లో రూ.4.48 కోట్ల వ్యయంతో చేపట్టే బోయిన్ చెరువు రిటైనింగ్ వాల్, మనసరోవర్ నాలా టీ జంక్షన్ పనులను మంత్రి కె.టి.ఆర్ శంకుస్థాపన చేస్తారు. రూ. 555 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఆలీ కాంప్లెక్స్ నుండి ఆర్.ఆర్. నగర్ ప్రాగా టూల్స్ బోయిన్ పల్లి వరకు స్టార్మ్ వాటర్ నాలా నిర్మాణానికి శంకుస్థాపన, రూ. 9.80 కోట్ల వ్యయంతో కూకట్ పల్లి లోని రంగదాముని చెరువు (ఐ.డి.ఎల్ లేక్) అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మూసాపేట్ సర్కిల్ వార్డు నెంబర్ 15 లో  సి.ఎస్.ఆర్ కింద రూ. 200 లక్షల వ్యయంతో బాలాజీ నగర్ లో హెచ్ ఐ జి పార్కు  అభివృద్ధి కి శంకుస్థాపన చేస్తారు.

రూ. 1.95 కోట్ల అంచనా వ్యయంతో  కె.పి.హెచ్.బి ఫేజ్- 2 బాలాజీ నగర్ లో ద ఇండోర్ షటిల్ కోర్టు, ప్రహరీ గోడ నిర్మాణ పనులను మంత్రి కె.టి.ఆర్ ప్రారంభించనున్నారు. కె.పి.హెచ్.బి ఫేజ్-7 వార్డు నెంబర్ 14 లో రూ. 3.23 కోట్ల వ్యయంతో చేపట్టిన హిందూ శ్మశాన వాటిక ను ప్రారంభించనున్నారు. కె.పి.హెచ్.బి  9 ఫేజ్ వార్డు 114 లో  మూసాపేట్ లో రూ. 150 లక్షల వ్యయంతో చేపట్టిన ఇండోర్ షటిల్ కోర్టు ను మంత్రి ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ వెంట మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కూకట్ పల్లి శాసనసభ్యులు  మాధవరం కృష్ణారావు, శాసన మండలి సభ్యులు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొననున్నారు.

మెట్లబావి రెడీ, నేడు మంత్రి పరిశీలన

సికింద్రాబాద్ లోని పురాతన మెట్ల బావి తిరిగి ప్రారంబోత్సవానికి సిద్దం అవుతోంది. బన్సీలాల్ పేటలో 300ఏళ్ల నాటి పురాతన బావి ఇది. పూడిపోయిన మెట్ల బావి పునరుద్ధరణ పనులను 2021లో ప్రారంభించారు. దాదాపు 5 వందల టన్నుల మట్టి, చెత్తను లారీల్లో తొలగించారు. మట్టి తీస్తున్నకొద్దీ అద్భుతమే బయటపడింది. ఆనాటి అరుదైన, చారిత్రక మెట్ల బావి కనిపించింది. మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ సహా అధికారులు ఈ రోజు బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. త్వరలో మెట్లబావి ప్రారంభోత్సవం జరగనుంది. 

బండి సంజయ్ పాదయాత్ర

నేడు బండి యాత్ర ఇలా కొనసాగనుంది. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఐదో రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముథోల్ మరియు నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. భాంనీ, నందన్, నర్సాపూర్, కుస్లీగెట్, నసీరాబాద్, రాంపూర్ మీదుగా పాదయాత్ర కొనసాగునుంది. ఈరోజు మొత్తం 12.1 కిలోమీటర్లు మేరకు పాదయాత్ర కొనసాగనుంది.

నేటి నుంచి తెలంగాణలో మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాలు

పీపుల్స్‌వార్‌ అగ్రనేతలు ఆదిరెడ్డి, సంతోస్ రెడ్డి, శీలం నరేష్‌ ప్రథమ వర్ధంతి రోజే వీరి జ్ఞాపకార్థం 2000 డిసెంబరు 2న పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ(పీజీఏ)ని పీపుల్స్‌వార్‌ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 2 నుంచి 8 వరకు పీజీఏ వారోత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. ప్రభుత్వంతో చర్చల సమయంలో 2004లో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మం డలంలోని బేగంపేట వద్ద నల్లా ఆదిరెడ్డి, సంతో్‌షరెడ్డి, శీలం నరేష్‌ జ్ఞాపకార్థం భారీ స్థూపాన్ని నిర్మించింది. ఈ క్రమంలో పీపుల్స్‌వార్‌లో దేశంలో మరో అతిపెద్ద నక్సల్‌ గ్రూపు ఎంసీసీఐ, విప్లవ సమాఖ్య తదితర సంఘాలు 2004 సెప్టెంబరు 21న విలీనమయ్యాయి. దీంతో సీపీఐ (మావోయిస్టు) పార్టీగా పీపుల్స్‌వార్‌ రూపాంతరం చెందింది. దీంతో పాటే పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ (పీజీఏ)ని కూడా పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీజీఎల్‌ఏ)గా పేరు మార్చారు.

నేటి నుంచి 5 తేదీ వరకు జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌

ఉన్నతాధికారులు, కలెక్టర్‌ ఆదేశాల మేరకు సైన్స్‌, మ్యాథ్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిబిట్లు ప్రదర్శన పూర్తి చేసాం అని జిల్లా విద్య శాఖ అధికారి వాసంతి తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షీయల్‌ పాఠశాలలకు చెందిన విద్యా ర్థులు హాజరుకావాలని సూచించారు. సైన్స్‌ఫెయిర్‌ చైర్మన్‌గా కలెక్టర్‌, మెంబర్‌ కన్వీనర్‌గా డీఈవో, 14 రకాల కమిటీలలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులు ఉన్నారని స్పష్టం డీఈవో చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా 250 ఎగ్జిబిట్లు వచ్చాయని, మరో 200 రావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఆల్ఫోర్స్‌ స్కూల్‌లో 35 రూములు సిద్ధం చేశామని, 7 పానెల్స్‌ ద్వారా జడ్జిమెంట్‌ కోసం కాకతీయ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థుకు మూడు రోజులపాటు భోజన వసతి, వైద్య, రవాణాఏర్పాట్లు చేయడం జరుగుతుం దన్నారు. 4న నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట, ఖానాపూ ర్‌ అన్ని రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, 5న వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, గీసుగొండ, దుగ్గొండి మండలాలను ఆహ్వానించినట్లు తెలిపారు.తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ఇప్పుడు లేనట్లే

రానున్న ఏడాది పాటు విద్యుత్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇదే విషయం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ)కి సమర్పించిన 2023-2024 సంవత్సరానికి సంబంధించిన నివేదికలో వెల్లడైంది. టీఎస్ఎన్‌పీడీసీఎల్, టీఎస్ఎస్‌పీడీసీఎల్ సంస్థలు విద్యుత్ సమర్పించిన నివేదికల్లో టారీఫ్ పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలేవీ పేర్కొనలేదు. దీంతో 2024 మార్చి వరకు రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు టారిఫ్‌లు పెంచే అవకాశం లేనట్లు అధికారులు చెబుతున్నారు.

Published at : 02 Dec 2022 08:47 AM (IST) Tags: Telugu News Today Telangana LAtest News TS News Developments Today Telangana Headlines Today

సంబంధిత కథనాలు

Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు,  పాతకక్షలతో మర్డర్!

Peddapalli Crime : రౌడీషీటర్ సుమన్ హత్య కేసును ఛేదించిన పోలీసులు, పాతకక్షలతో మర్డర్!

TSPSC: గ్రూప్-4 ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్ష తేదీ ప్రటించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC: గ్రూప్-4 ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్ష తేదీ ప్రటించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్‌లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?

Telangana budget 2023 :  కొత్త పన్నులు -  భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్‌లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?

Karimnagar News: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈఓ గానం

Karimnagar News: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జడ్పీ సీఈఓ గానం

TSWRES Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

TSWRES Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్! ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!

Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam