News
News
వీడియోలు ఆటలు
X

Top 5 Headlines Today: ‘జగనన్నకు చెబుదాం'తో ప్రజాసమస్యలకు చెక్! కుమార్తె ఫిర్యాదుపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భావోద్వేగం !

Top 5 Headlines Today 9th May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

FOLLOW US: 
Share:

'జగనన్నకు చెబుదాం'తో ప్రజాసమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం
ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని, వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతీ మంచి పనికి కూడా మాకు ఎంతిస్తారనే గుణం టీడీపీది అని విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వ పాలనలో అడుగడుగునా వివక్ష ఉండేదని, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని, వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం రోజే శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.  ఇంకా చదవండి

అకాల వర్ష బాధిత రైతుల వద్దకు పవన్ కల్యాణ్ - బుధవారం కడియంలో పర్యటన !
అకాల వర్ష బాధిత రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు. బుధవారం  తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.  కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శిస్తారు. తర్వాత   కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఓజీ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అకాల వర్షాల కారణంగా తూ.గో, ప.గో రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో..  రైతులకు మద్దతుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.   చివరి క్షణంలో ఖరారైన పర్యటన అయినప్పటికీ జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం మండంలలో జనసేన పార్టీ విజయం సాధించింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 16 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం 60 శాతం కోతలు పూర్తయ్యాయి. 7.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కేవలం మూడు లక్షలు మెట్రిక్‌ టన్నులే కొనుగోలు చేసింది. మిగిలిన 4.50 లక్షల టన్నుల్లో 1.50 లక్షల టన్నులు ప్రయివేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు అంచనా. మిగతా ధాన్యం రైతుల కళ్లాల్లో, ఆరుబయట ఉంది. ఈ  మధ్యలో అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోయాయి.    ఇంకా చదవండి

సంతకం ఫోర్జరీ చేశారని జనగామ ఎమ్మెల్యేపై కుమార్తె కేసు- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భావోద్వేగం !
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆయన కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఈ కేసు పెట్టడం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఎకరా ఇరవై గుంటల భూమిని తన పేరు మీద తీకుసున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఈ భూమిపై తీవ్ర వివాదం నడుస్తోంది. చెరువు భూమిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేశారంటూ విపక్షాల ఆరోపించాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహించాయి. అయితే ఇదే విషయమై తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భవాని రెడ్డి ఫిర్యాదుపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు అయ్యాయి.  ఇంకా చదవండి 

అమాయకులు చనిపోతున్నా ఏపీ ప్రభుత్వానికి పట్టదా? గంజాయి వినియోగంపై చంద్రబాబు ఫైర్ 
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగు, వినియోగంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గంజాయి వలన యువత ప్రాణాలను కోల్పోతున్నారని, హంతకులుగా మారుతున్నారని మాజీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్...
గంజాయి యువత ప్రాణాలు తీస్తుంది... ఎంతో మంది యువకుల్ని హంతకులనూ చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన ఓ గంజాయి ఘటనపై ప్రతిపక్షనేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. గంజాయిపై ఉదాసీనత దాన్ని మన బిడ్డల వరకూ తెస్తుందని చంద్రబాబు అన్నారు. విచ్చలవిడిగా గంజాయి వినియోగం యువత భవిష్యత్తుని నాశనం చేయడమే కాదు, ఏకంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కూడా తీస్తోందని ట్విట్టర్ లో అన్నారు. విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో జరిగిన చిన్న గొడవ ఏకంగా అజయ్ సాయి అనే యువకుడి ప్రాణాలు తీసిందని ఇది చాలా విషాదకర ఘటనగా చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఘటన ద్వారా మరో ఐదుగురు హంతకులుగా మారారని అన్నారు.  దీనికి ఈ ప్రభుత్వ సమాధానం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.  ఇంకా చదవండి

మరోసారి ఈడీ నోటీసులు - ఇంకా ఇండియాకు రాని చీకోటి ప్రవీణ్ !
క్యాసినో కింగ్  చీకోటి ప్రవీణ్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.  క్యాసినో కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ.. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసింది.   చీకోటితో పాటు చిట్టి దేవేందర్, సంపత్, మాధవరెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. ఇందులో సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కాగా  మరో ముగ్గురు ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. పట్టాయ కోర్టులో చీకోటి ప్రవీణ్ తో పాటు ఇతరులకు బెయిల్ వచ్చినప్పటికీ కొంత మంది ఇంకా ఇండియాకు చేరుకోలేదు. 
థాయ్‌లాండ్‌ నుంచి మే12న చికోటి ప్రవీణ్ హైదరాబాద్ కు వస్తానని ఆయన సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ అక్కడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ప్రవీణ్.   నాలుగు రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని చెబితే తాను థాయ్‌లాండ్‌ కు వెళ్లినట్లుగా తెలిపాడు.  దేవ్ , సీత అనే ఇద్దరు తనకు ఆహ్వానం పంపారని, ఆ టోర్నమెంట్ లీగల్ అనే చెబితేనే తాను వెళ్ళినట్టిగా చీకోటి తెలిపాడు.  .   థాయ్‌లాండ్‌  లో గ్యాంబ్లింగ్ నిషేధం అనేది తనకు తెలియదని చీకోటి చెప్పాడు.  తాను హాల్ లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని అన్నాడు. ఈ గ్యాంబ్లింగ్ తో సంబంధం లేదని తేలడంతో తాను చట్టపరంగా బయటకు వచ్చానని అన్నాడు.   చీకోటి ప్రవీణ్ కు థాయ్‌లాండ్‌  కోర్టు  షరతులతో కూడిన  బెయిల్  మంజూరు చేసింది.  ఆయనతోపాటు ఆరెస్ట్ అయిన   83 మంది భారతీయులకు కూడా  థాయ్‌లాండ్‌  కోర్టు బెయిల్ ఇచ్చింది.  4500 బాట్స్  జరిమానాతో కోర్టు అందరికీ బెయిల్ ఇచ్చింది.  జరిమానాను చెల్లించడంతో పోలీసులు వారికి పాస్ పోర్టులు  కూడా ఇచ్చేశారు.  ఇంకా చదవండి

 

Published at : 09 May 2023 03:15 PM (IST) Tags: BJP YSRCP AP Latest news BRS TDP Telangana LAtest News

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, రుతుపవనాలు రాయలసీమకు ఎప్పుడో తెలుసా?

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, రుతుపవనాలు రాయలసీమకు ఎప్పుడో తెలుసా?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు