News
News
వీడియోలు ఆటలు
X

Top 5 Headlines Today: నేటి ఉదయం నుంచి ఏపీ, తెలంగాణలో టాప్ హెడ్ లైన్స్ ఇవీ..

Top 5 Headlines Today: ఓ కానిస్టేబుల్, మరో ఎస్‌ఐపై దాడి చేసిన షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం అమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

FOLLOW US: 
Share:

Top 5 Headlines Today:  ఓ కానిస్టేబుల్, మరో ఎస్‌ఐపై దాడి చేసిన షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం అమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..  కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో షర్మిల ఉన్నారు. ఒక రోజు  జైల్లో గడపగానే బెయిల్ రావడంతో వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 

కోర్టు పెట్టిన షరతులు ఇవీ  

రూ. 30వేల పూచీకత్తు ఇద్దరు వ్యక్తులతో ఇప్పించాలని కోర్టు షరతు పెట్టింది. అలాగే విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. షర్మిల నిన్నే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదోపవాదాల తర్వాత కోర్టు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా పోలీసులపై దాడి చేశారు. అయితే పోలీసులు ఆమెపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఆమెపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని..  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. ఇంకా చదవండి 

షర్మిల భయపడే రకం కాదు, రేపు ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు - వైఎస్ విజయమ్మ

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. పోలీసులపై దాడి చేశారనే కేసులో నిన్న (ఏప్రిల్ 24) రాత్రి కోర్టు షర్మిలకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్ గూడలోని మహిళా కారాగారానికి తరలించిన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న షర్మిలను విజయమ్మ పలకరించేందుకు కారాగారం లోనికి వెళ్లారు.

బయటకు వచ్చిన అనంతరం జైలు బయట వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఎందుకు ప్రశ్నిస్తుందనే విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. యువతకు అన్యాయం జరిగినందున షర్మిల ప్రశ్నిస్తోందని అన్నారు. గ్రూపు ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో గళం ఎత్తుతుంటే ప్రభుత్వం అణచివేస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని ప్రభుత్వం అనుకుంటే, రేపటి నాడు ప్రజలు, యువకులే ప్రభుత్వానికి సమాధానం చెబుతారని అన్నారు. నేడో, రేపో బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి పనులకు వైఎస్ షర్మిల భయపడే రకం కాదని అన్నారు. ప్రజలకు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను చేరువ చేయాలనే లక్ష్యంతో షర్మిల పోరాడుతోందని చెప్పారు. అందుకే వేలాది కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసిందని గుర్తు చేశారు. ఇంకా చదవండి 

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ టెన్షన్ కంటిన్యూ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను బుధవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదావేసింది. ముందుగా ఈ కేసు విచారణ ఉదయం ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే    సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాష్ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన  తర్వాత మధ్యాహ్నం మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు బుధవారం వింటామని న్యాయమూర్తి .. కేసును వాయిదా వేశారు. 

గత విచారణలో ఈనెల 25 వరకు అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, తాము చెప్పిన విధంగా అవినాష్‌ను విచారించాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలాగే అవినాష్ మధ్యంతర బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. దీనిపై సునీతరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.  అలాగే ముందస్తు బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో  హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగాల్సి ఉంది. బుధవారం ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ వస్తుంది. ఇంకా చదవండి 

తెలుగుదేశం మహానాడుకు పోటీగా మరో కార్యక్రమం- ఈసారి జగన్ పాల్గొనే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు పోటీగా ఈ ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గానికి చెందిన నేతలతో సభను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
తెలుగు దేశం పార్టీ ఏటా మహానాడు కార్యక్రమాన్నినిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని రాజమండ్రిలో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. దీంతో తెలుగు దేశం నేతలు ఎన్నికల సమయానికి ముందు జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 
గతేడాది తెలుగుదేశం మహానాడు ప్రకాశం జిల్లాలో జరిగింది. తెలుగు దేశం మహానాడు కార్యక్రమానికి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీసీ బస్సు యాత్రని నిర్వహించారు. విశాఖ నుంచి అనంతపురం వరకు గతేడాది మే 26 నుంచి 29వ తేదీ వరకు సాగిందాయాత్ర. నాలుగు రోజులు పాటు మంత్రులు, బీసీ ప్రజాప్రతినిదులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలో పాల్గొన్నారు. 
అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళటం, ఆయన వెళ్తూ వెళ్తూ నేతలకు ప్రత్యేకంగా టాస్క్ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. తెలుగు దేశం నిర్వహించిన మూడు రోజుల మహానాడుకు పోటీగా అదనంగా ఒక రోజు పాటు అంటే నాలుగు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన నేతలు బస్సు యాత్ర నిర్వహించారు. ఇంకా చదవండి 

తెలంగాణ అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు- ప్రజల్లోకి సూటిగా వెళ్లేలా ప్లాన్

"తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం" అనే ట్యాగ్ లైన్ తో బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా గోడలపై కమలం పువ్వు గుర్తు, ఎన్నికల ట్యాగ్ లైన్ తో రాతలు రాయిస్తోంది. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో కనీసం ఐదు చోట్ల వాల్ రైటింగ్ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో ఒకే ఫార్మాట్ లో వాల్ రైటింగ్ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలోనే పలు చోట్ల గోడలపై రాతలు రాయించే కార్యక్రమం చేపట్టారు. గోడలపై.. తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం అంటూ రాస్తుండడంతో రాజకీయ హీట్ మరంత పెరిగింది. ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే బీజేపీ పార్టీ ఈ రేంజ్ లో ప్రణాళికలు రూపొందిస్తుండడంతో మిగతా పార్టీలు కూడా సన్నాహాలు మొదలు పెట్టాయి.  

Published at : 25 Apr 2023 03:30 PM (IST) Tags: YS Sharmila sharmila news AP news today Telangana News YSRTP Avinash Reddy

సంబంధిత కథనాలు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

TSPSC Group 1 Exam: 'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌ హాల్‌‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష వివరాలు ఇలా!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Top 10 Headlines Today: చంద్రబాబు - అమిత్ భేటీ వివరాలు; నేడు నిర్మల్‌కు కేసీఆర్ - ఇవాల్టి టాప్ 10 న్యూస్

Top 10 Headlines Today: చంద్రబాబు - అమిత్ భేటీ వివరాలు; నేడు నిర్మల్‌కు కేసీఆర్ - ఇవాల్టి టాప్ 10 న్యూస్

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ