By: ABP Desam | Updated at : 20 Dec 2022 02:17 PM (IST)
కాంగ్రెస్ సీనియర్లకు హైకమాండ్ బుజ్జగింపులు
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలను సర్దుబాటు చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. సలహాదారుగా దిగ్విజయ్ సింగ్‌ను నియమించినట్లుగా తెలుస్తోంది. దాంతో ఆయన పలువురు సీనియర్లకు పోన్ చేసి.. తొందరపడవద్దని సూచించినట్లుగా చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేరుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో మహేశ్వర్ రెడ్డి ఇంట్లో సమావేశం కావాలనుకున్న నేతలు ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు.
అసంతృప్త సీనియర్ నేతలతో మాట్లాడుతున్న హైకమాండ్ పెద్దలు
ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కోదండరెడ్డి.. సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఇళ్లకు వెళ్లి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. తొమ్మిది మంది సీనియర్ నేతల్లో కొంతమంది బీజేపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో హైకమాండ్ సీరియస్ గా రంగంలోకి దిగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న దిగ్విజయ్ సింగ్.. సీనియర్ల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయనున్నారు.
కమిటీల్లో ఎక్కువ మంది వలస నేతలకే చోటు దక్కిందని సీనియర్ల అసంతృప్తి
ఇటీవలే ప్రకటించిన కమిటీల్లో ఎక్కువగా రేవంత్ రెడ్డికి మద్దతు ఉన్నవాళ్లకే పదవులు వచ్చాయని సీనియర్లు అంటున్నారు. ఇలా ఉంటే పార్టీ తమ చేతుల్లో నుంచి వెళ్తొందని.. దీనికోసమే సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని సీనియర్లు తెరపైకి తీసుకు వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ కమిటీల్లో ఎలాంటి పదవీ.. దక్కని మరో నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీనియర్లకు మద్దతు తెలుపుతున్నారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మీ వెంట నేను అంటున్నారు. రేవంత్ తో కలిసి పని చేయడం కన్నా రాజకీయాలు వదిలేయడం బెటరని.. అందరూ బీజేపీలోకి రావాలని సీనియర్లకు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిస్తున్నారు.
రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి టీ కాంగ్రెస్‌లో కల్లోలం
రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంజి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో అంతర్గత పోరు ది. అయితే ఒక్కక్కరుగా కాకుంా.. అందరు సీనియర్లు ఒకేసారి తెరపైకి వచ్చారు. అయితే సీనియర్లు ఇలా పార్టీని రోడ్డు మీదకు తీసుకొస్తే.. నష్టపోయేది పార్టీనేనని మరికొంత మంది సీనియర్లు చెబుతున్నారు. ఏదైనా ఉంటే.. కూర్చొని పరిష్కరించుకోవాలని అంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు కార్యకర్తల్లో గందరగోళం నెలకొంటుందని చెబుతున్నారు. సేవ్ కాంగ్రెస్.. అంటూ పార్టీని ముంచేయోద్దని.. తప్పో.. ఒప్పో కూర్చొని మాట్లాడుకుని.. జనాల్లోకి పార్టీని తీసుకెళ్లాలని కొంతమంది కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పె్టటడంతో సీనియర్లు ఏమైనా స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.
ఈ సారి పక్కాగా పదవి - విజయసాయిరెడ్డికి రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ పోస్టు ఖరారు!
Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్
SIT To Supreme Court : సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సిట్ - ఎమ్మెల్యేలకు ఎర కేసు ఏ మలుపులు తిరగబోతోంది ?
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Minsiter Errabelli : బీఆర్ఎస్ నేత కన్నుమూత, పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి
Ponguleti Srinivas Reddy : మీకు ఖలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయండి, బీఆర్ఎస్ అధిష్ఠానానికి పొంగులేటి సవాల్
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్
Turkey Earthquake : అల్లకల్లోలమైన టర్కీ, సిరియా- ప్రకృతి కోపానికి 2300 మంది మృతి!
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !