అన్వేషించండి

TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 22ఏ భూముల అస్త్రంతో ప్రతిపక్షాలు రెడీ!

TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 22ఏ భూముల వ్యవహారం, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సభలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రతిపక్షాలు ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలపై పట్టు.

TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. 1000 రోజుల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై అంశాల వారీగా ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 22ఏ భూముల వ్యవహారంపై సభలో చర్చించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. ఈ విషయంపై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 22ఏపై ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు దీటుగా బదులిచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు రెడీ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ కూడా 22ఏ భూముల వ్యవహారంపై చర్చించాలని పట్టుబడుతున్నాయి. ఈ భూముల వ్యవహారంపైనే రెండు రోజులు చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనా వైఫల్యాల లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్, బీజేపీ చర్చకు రెడీ అవుతున్నాయి. 

Also Read: కేసీఆర్ రాజీనామా డిమాండ్ వెనుక కాంగ్రెస్ మైండ్ గేమ్ - అనర్హత వేటు వేసే ధైర్యం ఉందా?

4 నుంచి 6 రోజుల పాటు 

తొలిరోజు సమావేశానికి ముందు కొత్తగా నిర్మించిన ‘సెంట్రల్‌ హాల్‌’ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ హాల్‌కు మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరుపెట్టారు. ఈ కార్యక్రమం అనంతరం శాసనసభ, మండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. తొలిరోజు ఇరుసభల్లోనూ ప్రశ్నోత్తరాలను నిర్వహిస్తారు. తెలంగాణ సమగ్ర శిక్షణ, పీఎం స్కూల్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా, మెట్రో రైలుకు సంబంధించి ఆడిట్‌ రిపోర్టులను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభ, శాసన మండలికి వేర్వేరుగా బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలను చర్చించాలి? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు సుమారు 4 నుంచి 6 రోజుల పాటు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. చర్చలను బట్టి  సభ నిర్వహణ రోజులను పొడిగించే అవకాశం ఉంది. 

Also read: గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల అరాచకాలు - నకిలీ హిజ్రాల మాఫియా - పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు?

సీఎల్పీ సమావేశం 

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటైన సమాధానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం అవుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాల ఆరోపణలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు గాను సీఎల్పీ సమావేశం కూడా నిర్వహించాలని నిర్ణయిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా 22ఏ భూముల అంశంపై అసత్య ప్రచారం చేస్తుననారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇది ఉందనే విషయాన్ని సభలో చెప్పాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సమాచారం. అలాగే 1000 రోజుల కాంగ్రెస్‌ పాలన గురించి చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, నిధుల వినియోగం, సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం సహా పలు సంక్షేమ పథకాలను పార్టీలతో సంబంధం లేకుండా పేదలందరికీ ఇస్తున్న విషయాన్ని సభలో చెప్పాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రెడీ చేసింది.

బీఆర్ఎస్ అస్త్రాలు రెడీ  

కాంగ్రెస్ 1000 రోజులు పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, దళిత, గిరిజన, బీసీ ఇలా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందనే నినాదాన్ని అసెంబ్లీ, మండలిలో బలంగా వినిపించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కనీసం నెలరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్‌ చేస్తుంది. సాగునీటి ప్రాజెక్టులు, 22ఏ భూముల నిషేధం, నిరుద్యోగులు, విద్యార్థులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. 

నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ నిరసన 

నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వచ్చారు. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీషర్టులు విప్పి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు బనియన్లతో అసెంబ్లీ గేటు వద్దే నిలబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హరీశ్‌రావుతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు తనపట్ల అమానుషంగా ప్రవర్తించారని, తన చీర లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను మాజీ మంత్రి సబితారెడ్డి ఓదార్చారు. తోపులాటలో జగదీశ్ రెడ్డి కాలికి గాయమైంది. సీఎం రేవంత్ రెడ్డికి ఇంతకు ఇంతా చెల్లిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. 


Also read: బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?

Frequently Asked Questions

అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్న ముఖ్యమైన అంశం ఏమిటి?

అసెంబ్లీ సమావేశాల్లో 22ఏ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ప్రధానంగా చర్చించనుంది. ఈ విషయంపై చర్చకు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget