అన్వేషించండి

Munugodu TDP : మునుగోడు బరిలో టీ టీడీపీ - ఫైనల్‌గా క్లారిటీ వచ్చేసింది !

మునుగోడులో పోటీ చేయకూడనదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించారు.

Munugodu TDP :  మునుగోడులో తెలుగుదేశం పార్టీ పోటీ  చేయాలనుకుంటోందని ఆ పార్టీ తరపున సీనియర్ నేత జక్కిలి ఐలయ్య యాదవ్ పోటీకి ఆసక్తిగా ఉన్నారని రెండు రోజులుగా ప్రచారం సాగుతోంది. 13వ తేదీన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల్లో పోటీ చేసిన అంశంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కానీ రెండు రోజులు ఆలస్యంగా సమావేశం అవుతున్నారు. 15వ తేదీన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నారు. అయితే ఈ లోపు నామినేషన్ల గడువు ఆఖరికి వస్తుంది. అప్పుడు నిర్ణయం తీుకున్నా టీడీపీ అభ్యర్థి పోటీ చేసే పరిస్థితి ఉండదు. అందుకే  తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలన్న ఆలోచనలో లేదని తెలుస్తోంది. 

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయం

ఇటీవల తెలంగాణలో మారిపోయిన రాజకీయ పరిస్థితులతో .. తెలుగుదేశం పార్టీని మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీపై టీఆర్ఎస్ నేతలు ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్‌గా మారిపోవడం.. ఏపీలో కూడా పోటీ చేయడానికి సిద్ధం కావడంతో .. తెలుగుదేశం పార్టీ కూడా ఇక తమ జవ సత్వాలన్నింటినీ కూడగట్టుకోవాలని అనుకుంటోంది.  ఇప్పుడు ఉపఎన్నికల్లో పోటీ చేసి సమయాన్ని వృధా చేసుకోవడం కన్నా.. వచ్చే ఎన్నికల నాటికి వీలైనంతగా బలపడే ప్రయత్నం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ దిశగా కార్యాచరణ కోసమే చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. 

లీడర్, క్యాడర్ లేని పార్టీగా మారిన టీడీపీ.. సానుభూతి పరులపైనే ఆశలు

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలందరూ ఇతర పార్టీల్లో చేరిపోయారు. క్యాడర్ కూడా వారి వెంట వెళ్లిపోయారు. కానీ టీడీపీ సానుభూతిపరులు మాత్రం ఎక్కువగానే ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ మళ్లీ రీవైవ్ అయితే ..ఇతర పార్టీలు అంత తేలికగా తీసుకోవన్న అభిప్రాయం ఉంది. తెలంగాణ బీసీ వర్గాల్లో టీడీపీకి ఉన్న పట్టు కారణంగా... తెలంగాణ సెంటిమెంట్ లేకపోతే.. బాగా బలం పుంజుకుంటుందన్న వాదన ఉంది. అందుకే.. టీడీపీ ముఖ్య నేతలు ఇప్పుడు ఈ కోణంలోనే రాజకీయంగా బలపడే ఆలోచనలు చేస్తున్నారు. 

ఏపీపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి రావడంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. మరో సీనియర్ నేతకు కూడా బాధ్యతలు అప్పగించలేకపోతున్నారు. ఇక ముందు మంచి ప్రజాకర్షణ ఉన్న నేతను తెలంగాణకు ఇంచార్జిగా నియమించే ఆలోచన చంద్రబాబు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలా ముందుకు వెళ్లాన్న అంశంపై చంద్రబాబు.. పదిహేనో తేదీన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.  ఉపఎన్నికల్లో ఎప్పుడూ ఓ అంశంపైనే ఓటింగ్ జరుగుతుందని..  పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
Naga Chaitanya : నాగ చైతన్య బీస్ట్ మోడ్ - హాలీవుడ్ రేంజ్ వృషకర్మ కోసం న్యూ లుక్
నాగ చైతన్య బీస్ట్ మోడ్ - హాలీవుడ్ రేంజ్ వృషకర్మ కోసం న్యూ లుక్
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
Dacoit Movie : డెకాయిట్‌లో కన్నెపెట్టరో సాంగ్ రీమిక్స్ - కాపీ రైట్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ రియాక్షన్
డెకాయిట్‌లో కన్నెపెట్టరో సాంగ్ రీమిక్స్ - కాపీ రైట్స్ కాంట్రవర్సీపై ప్రొడ్యూసర్ రియాక్షన్
Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
Embed widget