Telangna Elections 2023 : శుక్రవారమే నామినేషన్లకు లాస్ట్ డే - ఆ స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులేరీ ?
నామినేషన్లకు చివరి రోజు వచ్చినా కొన్ని స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి. చివరి రోజు వారికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయించే అవకాశం ఉంది.
Telangna Elections 2023 Congress BJP No Candidates : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 10న నామినేషన్ల ( Nominations ) ఘట్టానికి తెరపడనుంది. ఈ నెల 3వ తేదీతో ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో పూర్తవుతుంది. గురువారం ఏకాదశి కూడా కావడంతో మంచి రోజని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్ల దాఖలు చేశారు. చివరి రోజున మరకొంత మంది నామినేషన్లు వేయనున్నారు. అయితే ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి.
119 స్థానాలకూ బీ ఫాంలు ఇచ్చిన బీఆర్ఎస్ ( BRS )
BRS పార్టీ ఇప్పటి వరకూ 119 మంది ఎమ్మెల్యే అభ్యర్దులను ప్రకటించడంతోపాటు వారికి బిఫామ్ లు అందజేసింది. మొదట 110 మంది అభ్యర్దులకు భీఫామ్ లు ఇవ్వగా ,ఇటీవల మరో తొమ్మిది మంది అభ్యర్దులను ప్రకటించి వారికి సైతం బిఫామ్ లు అందజేసారు. స్టేషన్ ఘన్‌పూర్, వేములవాడ ( Vemulavada ) , బోథ్, ఉప్పల్, వైరా, ఖానాపూర్, ఆసిఫాబాద్ వంటి ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్దానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. చివరి క్షణంలో ఆలంపూర్ ఎమ్మెల్యే ను కూడా కాదని కొత్త అభ్యర్థి విజయుడుకు బీఫాం ఇచ్చారు.
బీజేపీలో ఇంకా 11 స్థానాలకు అభ్యర్థుల పెండింగ్
BJP 52మందితో తొలి జాబితా, 33మందితో రెండో జాబితా, మూడో జాబితాలో ఒక్కరి పేరే ప్రకటించింది. ఇటీవల నాలుగవ జాబితాలో 12 మంది అభ్యర్దులను ప్రకటించింది.మొత్తంగా ఇప్పటి వరకూ 100మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించగా ఇంకా 19మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో 8 స్దానాలు జనసేన తన అభ్యర్దులను ప్రకటించడంతో మొత్తంగా బిజెపి 108 స్దానాల్లో అభ్యర్దులను బరిలోకి దించినట్లయ్యింది. మరో పదకొండు చోట్ల అబ్యర్దులను ప్రకటించాల్సిఉంది. వీరిలో పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులను ఖరారు చేయలేకపోయారు. అయితే నామినేషన్లు దాఖలు చేసుకోవాలని ఖరారు చేసిన అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది . శేరిలింగంపల్లికి రవికుమార్ యాదవ్ పేరును బీజేపీ ఖరారు చేసిందని చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో తేలని నాలుగు సీట్ల పంచాయతీ
మొదటి,రెండు జాబితాల్లో కలిపి వంద స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది కాంగ్రెస్. తర్వాత రెండు స్థానాల్లో మార్పులను కలిపి మొత్తం 16 మందిని ప్రకటించింది. దీంతో.. 119 స్థానాలకు గానూ.. కాంగ్రెస్ మొత్తం 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 5 స్థానాలకు ప్రకటించాల్సి ఉండగా.. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. ఇక మిగిలిన నాలుగుచోట్ల అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది కాంగ్రెస్ . అవి సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పట్టుబడుతున్నారు. వీరికి అగ్రనేతలు సపోర్టు చేస్తున్నారు. తుంగతుర్తి, మిర్యాలగూడలోనూ అంతే. అంతే శుక్రవారం ఈ పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వస్తే ఆయనకు బీఫాం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.