అన్వేషించండి

CM KCR: సెప్టెంబర్ 1న జరిగే కేఆర్ఎంబీ సమావేశానికి హాజరుకావాలి.. వాదనలు గట్టిగా వినిపించాలి

సెప్టెంబర్ 1న జరగబోయే కేఆర్‌ఎంబీ సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.  కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు.


సెప్టెంబర్ 1న జరగనున్న కేఆర్ఎంబీ సమావేశానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.  అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకురాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్ సీ మురళీధర్ తదిరతులు పాల్గొన్నారు. 

కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటివాటాకోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ చెప్పారు. సాధికారిక సమాచారంతో కేఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు.

కేఆర్ఎంబీకి ఏపీ లేఖ

మరోవైపు తాజాగా కృష్ణా జలాల్లో తమకు 70 శాతం వాటా కేటాయించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని ఆ ప్రకారమే ఇక ముందు కూడా కేటాయింపులు జరపాలని కోరింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర  విచారణ జరుగుతోందని లేఖలో ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ ఏడాది నీటి కేటాయింపులు జరిపే వరకూ తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు లేఖలో ఏపీ ఈఎన్‌సీ వెల్లడించారు.  

ఏపీ ప్రభుత్వం ఇలా లేఖ రాయడానికి కారణం .. కృష్ణా జలాల్లో సగం సగం వాటా కావాల్సిందేనని కొద్ది రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖలు రాయడమే.  ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేనందున తాత్కాలికంగా ఈ వాటర్‌ ఇయర్‌లో.. 811 టీఎంసీల కృష్ణా జలాలను చెరి సగం పంచాలంటూ తెలంగాణ పట్టుబడుతోంది.  అలా కేటాయించవద్దని ఏపీ సర్కార్ కోరుతోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా నీటిని గతంలో బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించింది. 

ప్రాజెక్టులవారీగా కేటాయింపులు జరగాలంటూ తెలంగాణ ప్రభుత్వం బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విభజన అనంతరం ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే నిష్పత్తితో జలాలను పంచుకోవడానికి అప్పట్లో రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. కానీ ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ప్రారంభమయ్యాయి. దీంతో కృష్ణా జలాలను చెరి సగం పంచాలని తెలంగాణ డిమాండ్ చేయడం ప్రారంభించింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ- హాజరుకాని ఐదుగురు మంత్రులు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ- హాజరుకాని ఐదుగురు మంత్రులు
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!

వీడియోలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget