అన్వేషించండి

TS Changes To TG: TS పేరు TGగా మార్పు - వాహనాల నెంబర్ ప్లేట్స్ మార్చాలా?, అధికారులు ఏం చెబుతున్నారంటే?

Telangana News: తెలంగాణ ప్రభుత్వం TS పేరును TG గా మార్చిన నేపథ్యంలో ఇప్పటివరకూ టీఎస్ గా ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చాలా.? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే, దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.

TS Name Changed to TG For Vehicle Registrations: తెలంగాణ ప్రభుత్వం TS పేరును TGగా మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో తెలంగాణ స్టేట్ (TS) బదులుగా తెలంగాణ గవర్నమెంట్ (TG) అని మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో టీఎస్ అని ఉన్న వాహనాలు, ఇతర సంస్థల పేర్లు టీజీ అని మారుస్తారా.? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చాలా.? అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న టీఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని.. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకే నెంబర్ ప్లేట్లను ఇలా రిజిస్టర్ చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం 'TG' మార్పుపై అధికారిక జీవో విడుదల చేసిన తర్వాత కొత్త వాహనాలకు టీజీ నెంబరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని సమాచారం. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడినప్పుడు సైతం ఇదే తరహాలో మార్పులు జరగ్గా.. అప్పటివరకూ ఉన్న ఏపీ రిజిస్ట్రేషన్లను యథావిధిగా కొనసాగిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. విభజన అనంతరం ఏపీ నెంబర్ ప్లేట్స్ తోనే 30 లక్షల వాహనాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వాహనదారులపై భారం పడకుండా రాష్ట్ర రవాణా శాఖ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

గైడ్ లైన్స్ సిద్ధం?

రాష్ట్రంలో ఇప్పటికే 1.50 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 10 వేల నూతన వాహనాలు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అయితే, కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాల నెంబర్ ప్లేట్స్ మాత్రమే 'TG'గా మార్చేలా రవాణా శాఖ గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 'TS'గా ఉన్న నెంబర్ ప్లేట్లు అలాగే కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి మరో 2, 3 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

'అందుకే మార్చాం'

మరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహం రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ TS నుంచి TGగా మార్చడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. ఈ నిర్ణయాల వెనుక 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉందని అన్నారు. 'ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే ‘జయ జయహే తెలంగాణ' గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా.. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా… రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా… వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ నినాదం TG అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం.' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Also Read: Komati Reddy Venkata Reddy : అవసరం లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget