అన్వేషించండి

Telangana News: కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు సఫలం, దీపావళిలోపు కొంత మొత్తం విడుదల

Telangana Colleges Bandh | కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ మంత్రులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో కాలేజీలు యథాతథంగా సేవలు అందించనున్నాయి.

Colleges Bandh In Telangana | హైదరాబాద్‌: తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ ఇతర వృత్తి విద్యా కళాశాలల (Pirivate Colleges) యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి. దీపావళి పండుగలోపు రూ.1200 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని కాలేజీ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తోటి మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వృత్తి విద్య కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం మంత్రులు, కాలేజీ యాజమాన్యాలు సంయుక్తంగా మీడియాకు ప్రకటన చేయనున్నారు.

పెండింగ్ బకాయిలు చెల్లించలేదని నిరసినగా బంద్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు నాలుగేళ్ల పాటు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ వృత్తి విద్యా కళాశాలలు నేటి నుంచి బంద్‌ పాటిస్తున్నాయి. దాదాపు 8000 కోట్ల వరకు పెండింగ్ ఉందని కాలేజీ యామమాన్యాల సమాచారం. రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బంద్ పాటిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ,  ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫెడరేషన్ ఇదివరకే ప్రకటించాయి.


Telangana News: కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వ చర్చలు సఫలం, దీపావళిలోపు కొంత మొత్తం విడుదల

ఆర్థిక సమస్యల్లో తెలంగాణ ప్రభుత్వం      

తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా నిర్వహణ కోసం, పథకాలకు నిధుల సర్దుబాటు అప్పులు చేస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉందని అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రొఫెషనల్ కోర్సులు అందించే బీటెక్, ఎంసీఏ, లా, ఫార్మసీ, ఎంబీఏ లాంటి కాలేజీలు సమ్మెలోకి వెళ్లాయి. సోమవారం నుంచి నిరవధికంగా బంద్ ప్రకటించాయి. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, అసోసియేషన్ తో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు కొన్ని గంటలపాటు చర్చలు జరిపారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ  బకాయిల కోసం ప్రైవేట్ ఆస్పత్రులూ సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. తమకు రావాల్సిన ఆరోగ్యశ్రీ నిధుల బకాయిలు జమ చేయకపోతే సమ్మె తప్పదన్నాయి.

ప్రభుత్వం తరపున ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ పథకాల అమలులో భాగంగా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పెండింగ్ లో ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఓపిక నశించిన కాలేజీలు, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ సమ్మెకు నిర్ణయం తీసుకున్నాయి. మొదట కాలేజీలు నేటి నుంచి నిరవధిక బంద్‌ కొనసాగిస్తుండగా.. కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి.       

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Harish Rao Irrigation Department Challenge: 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా - సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా - సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Hybrid SUV Range: 1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Embed widget