అన్వేషించండి

Uttam Met Sonia, Rahul: ఎంపీ పదవికి ఉత్తమ్‌ రాజీనామా- సతీసమేతంగా సోనియా, రాహుల్‌ను కలిసిన మంత్రి

Telangana News: తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ముందుగా పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీని కలిసి.. ఆ తర్వాత పార్లమెంట్‌కు వెళ్లి రిజైన్‌ లెటర్‌ సమర్పించారు.

Uttam Resigned MP Post: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటన (Delhi Tour)లో ఉన్నారు. బుధవారం (డిసెంబర్ 13న) ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన... టెన్‌ జన్‌ఫథ్‌లో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంట ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి(MLA Padmavathi) కూడా ఉన్నారు. సోనియా, రాహుల్ గాంధీతో కాసేపు సమావేశయ్యారు. ఫొటోలు కూడా దిగారు. ఆ ఫొటోలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సోనియా, రాహుల్‌ గాంధీని కలిసిన తర్వాత... పార్లమెంట్‌కు వెళ్లారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam kumar Reddy)‌. తన ఎంపీ పదవి (MP Post)కి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేశారు. ఈ విషయాన్ని కూడా ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. 

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌ కాంగ్రెస్‌ తరపు నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు తాగా... తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌  నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన భార్య పద్మావతి కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. తెలంగాణలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాడటంతో.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. డిసెంబర్‌ 7న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఎల్బీ స్టేడియంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయనకు.. నీటి పారుదల శాఖ, ఎత్తిపోతల పథకాలు, ఆహారం, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు సీఎం రేవంత్‌రెడ్డి.

తెలంగాణలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... తన ఎంపీ పదవిని వదులుకోవాలి. దీంతో ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎంపీగా  రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి... తన రాజీనామా లేఖను సమర్పించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా భాత్యతలు చేపట్టాక...  రోజూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు ఉత్తమ్‌కుమార్‌. నీటిపారుదల (Irrigation), పౌరసరఫాల శాఖల(Civil Supplies Department)పై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఆయా శాఖలు అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది కార్డుదారులు రేషన్‌ తీసుకోవడం లేదని పౌరసరఫరాల సంస్థ గుర్తించింది. వారి కార్డులో ఉంచాలో లేదా అన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయిస్తామన్నారు. ఇక... మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిన అంశంపై కూడా విచారణ జరిపిస్తామన్నారు.

తెలంగాణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోనియా, రాహుల్‌ గాంధీని కలవడం కూడా ఇదే మొదటిసారి. తనకు మంత్రి పదవి ఇచ్చి.. ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినందుకు సోనియా, రాహుల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget