Breaking News: అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లు.. సభ్యులను కాసేపట్లో ప్రకటించే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కార్యాలయంలో తెలంగాణ సీసీఎస్ పోలీసులు సోమవారం మరోసారి సోదాలు నిర్వహించారు. ఆయన కార్యాలయంలో సోదాలు చేయడం వరుసగా ఇది మూడోసారి. కార్యాలయంలోని 10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్క్‌లు, పత్రాలు, పుస్తకాలు పోలీసులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత నెల 27 నుంచి తీన్మార్ మల్లన్న చంచలగూడ జైలులో ఉన్నారు. ఈ కేసులో భాగంగా పీర్జాదిగూడ కెనరానగర్ సమీపంలోని ప్రజా క్లినిక్ నిర్వాహకుడు డాక్టర్ ఇమ్మానేయల్‌ను కూడా పోలీసులు విచారించారు. మల్లన్నకు గతంలో కరోనా సోకగా ఈ వైద్యుడి వద్ద చికిత్స పొందినట్లు సమాచారం. ఆయన్ను పోలీసులు రహస్యంగా విచారించి వైద్యం వివరాలు సేకరించినట్లు తెలిసింది.
అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లు
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేశారని అధికారిక వర్గాల సమాచారం. మహమ్మద్ హసన్‌ను తమ అధినేతగా తాలిబన్లు ప్రకటించుకున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వమని ప్రకటించారు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బారాదర్ అఫ్గాన్ ఉపాధ్యక్షుడుగా వ్యవహరించనున్నారు. మంగళవారం రాత్రి అఫ్గాన్‌లో నూతన ప్రభుత్వంలో మంత్రులు, సభ్యుల వివరాలు వెల్లడికానున్నాయి.
నకిలీ చలాన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
నకిలీ చలాన్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రికవరీ కానీ ఆస్తులు స్టాంప్ డ్యూటీ కట్టని జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.6.50 కోట్లు రికవరీ అయినట్లు అధికారులు గుర్తించారు.





















