అన్వేషించండి

Telangana News: గ్రామ పంచాయతీల నిధుల ఆన్లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ టాప్... రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం అభినందన లేఖ...

గ్రామ పంచాయతీలో నిధుల వినియోగం ఆన్లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ మొదటి స్థానంలో నిలించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాన్ని అభినందిస్తూ లేఖ రాసింది.

దేశంలో... అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ అనేక అవార్డులు సొంతం చేసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుందన్నారు. తాజాగా గ్రామ పంచాయతీల ఆన్లైన్ ఆడిటింగ్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. గత ఏడాది కూడా తెలంగాణ ఆన్లైన్ ఆడిటింగ్ లో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ వరుసగా రెండో సారి కూడా తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖను అభినందిస్తూ లేఖ రాసిందని తెలిపారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ లేఖ రాశారు. దేశంలో ఆన్లైన్ ఎడిటింగ్ లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు లీడ్ రోల్ పోషిస్తున్నట్లు లేఖలో అభినందించారు.

Also Read: ప్రేమ‌లేఖ‌లు ఇచ్చేందుకో.. ప్రేమించేందుకో.. ఢిల్లీకి రాలేదు

2019-20లోనూ టాప్ 

కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఆడిటింగ్ నిర్వహిస్తుంది. 2020-21వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగంపై ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు నిధుల ఖర్చును ఆన్లైన్ లోనే  అందిస్తున్నది. ఈ విధంగా నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్లైన్ ఎడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ, దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతంతో తమిళనాడు, 60 శాతం తో ఆంధ్ర ప్రదేశ్, 59 శాతంతో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతానికి లోపే ఆన్లైన్ ఎడిటింగ్ పూర్తి చేసి  వెనుకబడ్డాయి. కాగా 2019-20 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగంపై నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. 

Also Read: దేశంలో ఒమిక్రాన్ ప్రకంపనలు... మళ్లీ రాష్ట్రాల్లో మొదలైన ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు... మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శం: మంత్రి ఎర్రబెల్లి 

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయని దేశానికి ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్రం నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికికి బాటలు వేశారన్నారు. చిన్న గ్రామపంచాయతీలకు కూడా కనీసం ఐదు లక్షల రూపాయలు విడుదల చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంప్ యార్డ్, స్మశాన వాటిక, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, హరిత హారం కింద మొక్కలు వచ్చాయన్నారు. నిరంతర పారిశుద్ధ్యం కొనసాగుతుండటం వల్ల పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు గా మారాయని అన్నారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ప్రభుత్వం నిర్దేశాలకనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. 

Also Read:  సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్

మంత్రి హరీశ్ రావు అభినందన

ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఆన్లైన్ ఆడిటింగ్ లో నెంబర్ వన్ గా నిలిచిన గ్రామ పంచాయతీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హారీశ్ రావు అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి, ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను మంత్రి హారీశ్ రావు అభినందించారు.

Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget