అన్వేషించండి

TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కాసేపట్లో తీర్పు- అంతటా ఉత్కంఠ!

TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 

TRS MLAs Poaching Case: మోయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు జరిగే విచారణ కీలకం కానుంది. సిట్ రివిజన్ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. కేసు విచారించే అర్హత లా అండ్ ఆర్డర్ పోలీసులకు లేదంటూ ప్రతివాదనలు జరిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ అన్ని పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. 

రామచంద్ర భారతి విడుదల

రెండోసారి అరెస్టై జైల్లో ఉన్న రామచంద్రభారతి ఇవాళ విడుదలయ్యారు. మోయినాబాద్ ఫాం హౌస్ కేసులో నిందితులైన రామ చంద్ర భారతి, నంద కుమార్ ను పోలీసులు నిన్న రెండోసారి అరెస్టు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కేసులో చంచల్ గూడ జైలు నుంచి వారు బయటకు వచ్చేలోపు ఇతర కేసులతో అరెస్ట్ చేశారు. నెలన్నర కాలంగా జైల్లో ఉన్న వీరిద్దరినీ విడుదల అయిన వెంటనే అరెస్ట్ చేశారు. కారాగారం నుంచి తమ వస్తువులతో సహా బయటకు రాగా.. అప్పటికే పోలీసులు గేటు వద్ద కాపు కాశారు. నిందితులు ఇద్దరూ గేటు దాటిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఇద్దరినీ ఎక్కించారు. విచారణ ఖైదీలుగా చంచల్ గూడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేయటంతో పూచీకత్తు సమర్పణ అనంతరం మొన్న సింహయాజీ బయటకు వచ్చారు. 

కేసు ఏంటి, ఏం జరిగింది?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం నెల రోజులుగా తెలంగాణలో సంచలం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 100 కోట్ల ఇస్తామని రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ ఆశ చూపారు. ముందు పైలెట్ రోహిత్ రెడ్డి కలిసిన ఈ నేతలు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఫామ్ హౌస్ వీడియోలు, ఆడియోలను టీఆర్ఎస్ బయటపెట్టింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్ ను తిరస్కరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎఫ్ఐఆర్‌లో ఇలా..

నిందితులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన బేరసారాలను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పూసగుచ్చినట్టు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, నందకిశోర్‌, సింహయాజీపై కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు.  బీజేపీలో చేరితో వంద కోట్లు... చేర్చిన వాళ్లకు యాభై కోట్ల పేరుతో ఆఫర్‌ నడిచించదని పోలీసులు చెబుతున్నారు. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇప్పిస్తామని రోహిత్‌ రెడ్డికి రామచంద్ర భారతి ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు. దీనికి నంద కిశోర్‌ మధ్యవర్తిత్వం వహించారు. నంద కిశోర్ ఆహ్వానంతోనే  రామచంద్రభారతి, సింహయాజీ ఫామ్‌హస్‌కు వచ్చారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన వారు ఎమ్మెల్యేలతో బేరాలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.  వచ్చిన మధ్యవర్తులు జరగబోయే పరిణామాలు వివరించారని పేర్కొన్నారు పోలీసులు. బీజేపీలో చేరకపోతే...కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పినట్టు కూడా అందులో తెలిపారు. బీజేపీలో చేరితే కీలక కాంట్రాక్ట్స్‌తోపాటు భారీ మొత్తంలో డబ్బు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామన్నట్టు వివరించారు. ఇదంతా రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget