అన్వేషించండి

High Court Liberality: తెలంగాణ హైకోర్టుకు చిన్నారుల లేఖ- పార్కు స్థలం కబ్జాపై విచారణకు ఆదేశం

High Court News: పార్కు స్థలం కబ్జా చేశారంటూ చిన్నారుల రాసిన లేఖను పిల్ గా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు, విచారణకు ఆదేశం

Telangana Viral News: తాము ఆడుకునే పార్కు స్థలం కబ్జా చేశారంటూ చిన్నారుల రాసిన లేఖపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court) పెద్దమనసు చాటుకుంది. బాలల లేఖనే పిల్ గా స్పీకరించి విచారణ చేపట్టింది. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వచ్చే నెల 7లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడం విశేషం. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని చేర్చడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి..

పార్కుస్థలం కబ్జా
ఖాళీ స్థలం కనిపిస్తే కన్నేయడం కబ్జాలు చేసి బోర్డులు పెట్టడం పరిపాటిగా మారింది. ఇక ప్రభుత్వ స్థలమో,కాలనీల్లో పార్కుల కోసం వదలిన స్థలమో అయితే అక్రమార్కుల పండుగే. అడిగే వారు ఉండని అందినకాడికి దోచుకుంటున్నారు. కొద్దోగొప్ప పలుకుబడి ఉండటంతో లేదా బెదిరించి, భయపెట్టి లాక్కుంటున్నారు . దొంగపత్రలు సృష్టించి బురిడీ కొట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్(Adilabad) చోటుచేసుకుంది. పార్కు(Park)స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన అక్రమార్కులకు చుక్కెదురైంది.

పార్కు కోసం పిల్లలపోరాటం
ఆదిలాబాద్‌‌(Adilabad)లోని బడుగు వర్గాల కోసం 1970లో హౌసింగ్‌‌ బోర్డు కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం, పెద్దల వాకింగ్ కోసం 15 ఎకరాలను కేటాయించారు. ఈ భూమిలో 30 గుంటల స్థలాన్ని 20 ఏళ్ల క్రితమే కొందరు ఆక్రమించారు. మిగిలిన స్థలాన్ని కూడా ఆక్రమించుకునేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే పార్కు(Park) స్థలాన్ని కబ్జా చేస్తున్నారని గ్రహించిన స్థానికులు ఆక్రమణలను నిలువరించాలంటూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేదు. తాము ఆటలాడుకునే స్థలం తమ నుంచి దూరమవుతుందని బాధపడిన చిన్నారులే నడుంబిగించారు. తమకు న్యాయం చేయడంంటూ ఏకంగా తెలంగాణ హైకోర్టు(High Court)కు 23 మంది పిల్లలు లేఖరాశారు. పార్కు స్థలం కాపాడి న్యాయం చేయడంటూ వేడుకున్నారు. తాము ఆడుకోవడానికి ఉన్న ఏకైక పార్కు స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమిస్తుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికారులే వారికి కొమ్ముకాస్తున్నారని లేఖలో వివరించారు. ఆదిలాబాద్ నగర కమిషనర్ శైలజా వారికి వత్తాసు పలుకుతోందని...స్థలం ఎలా చేజిక్కించుకోవాలో కూడా వారికి సలహాలు ఇస్తోందని చిన్నారులు లేఖలో పేర్కొన్నారు. తక్షణం విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

హైకోర్టు పెద్దమనసు
చిన్నారుల లేఖను పెద్దమనసులో పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు...ఆ లేఖనే పిల్ గా పరిగణించి విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే(Alok Aradhe), జస్టిస్ అనిల్ కుమార్(Anil Kumar) తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపి ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్‌‌ కమిషనర్, ఆదిలాబాద్‌‌ జిల్లా కలెక్టర్‌‌కు నోటీసులు జారీ చేసింది. కబ్జాదారులకు మున్సిపల్‌‌ కమిషనర్‌‌ శైలజ(Sailaja) సలహాలిస్తున్నారని పిల్లలు ఆ లేఖలో పేర్కొన్నందున ఆమెను కూడా ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులంతా తమ వాదనలతో కౌంటర్‌‌ వేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. చిన్నారుల సాహసాన్ని ప్రతిఒక్కరూ మెచ్చుకుంటుండగా...న్యాయం ముందూ చిన్నా, పెద్దా తేడాలది అందరికీ అందుబాటులో ఉంటుందని తెలంగాణ హైకోర్టు మరోసారి నిరూపించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Embed widget