అన్వేషించండి

Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ద్రోణి ప్రభావంతో ఏపీలో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనుండగా.. మిగతా జిల్లాల్లో వడగాల్పులు వీచనున్నాయి.

Rains In Telangana | హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు వడదెబ్బతో అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన వడగాల్పులు వీస్తున్న క్రమంలో  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు అత్యంత కీలకమైన రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆదివారం (మే 31న) వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

మరోవైపు, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఎండల ప్రభావం అధికంగా ఉంది. ఈ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని, అత్యవసరమైతే తప్ప వృద్ధులు, చిన్నపిల్లలు మధ్యాహ్నం పూట బయటకు రాకూడదని అధికారులు సూచించారు.

పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు
రాష్ట్రంలో ఒకవైపు ఎండలు భయపెడుతుండగా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములోనింబస్ (Cumulonimbus) మేఘాల ప్రభావంతో నేడు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో వర్ష సూచన ఉంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అకాశం ఉన్నందున, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

Also Read: Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్

ద్రోణి ప్రభావంతో ఏపీలో తగ్గుముఖం పడుతున్న ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తాజాగా పలుచోట్ల కురుస్తున్న వర్షాలు ఎండల నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆదివారం రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

రాయలసీమలో వర్షాలు..
నేడు అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం సాయంత్రం వరకు వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా హుస్సేనుపురంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 51 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

Also Read: PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు

17 మండలాల్లో వడగాల్పులు
రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 మండలాలపై వడగాల్పుల (Heatwaves) ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. శనివారం నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు తగ్గుతున్నప్పటికీ, వడగాలులు వీస్తున్నాయి కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget