By: ABP Desam | Updated at : 16 Jul 2022 12:22 PM (IST)
మంకీపాక్స్ పై తెలంగాణ మార్గదర్షకాలు
Monkey pox: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు అవడంతో.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంకీపాక్స్ ఇప్పటికే 50 దేశాల్లో వ్యాప్తి చెందింది. జనవరి 1 నుంచి జూన్ 22 వరకు 3,412 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతి చెందారని వైద్య శాఖ అధికారులు చెబుతున్ారు. జంతువుల నుంచే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వివరిస్తున్నారు. అయితే ఆ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాస రావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
మంకీపాక్స్ ను ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఎలాంటి రోగుల నుంచి నమూనాలను సేకరిచాలి, వారిని ఎలా గుర్తించాలి, ముందుస్తుగా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలా అడ్డుకోవాలి వంటి తదితర అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో డీహెచ్ సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు పంపించారు.
మంకీపాక్స్ లక్షణాలు ఇలా ఉంటాయి..
మంకీ పాక్స్ వ్యాధి సోకితే జ్వరం వస్తుంది. దీనితో పాటు తల నొప్పి, నడుం నొప్పి, కండరాల నొప్పి, వాపు, అలసట వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. స్మాల్ పాక్స్ మాదిరే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు వస్తాయి. బొబ్బలు ఏర్పడతాయి. మంకీ పాక్స్ ఎక్కువగా ఉన్న వారిలో శరీరమంతా ఈ పొక్కులు వస్తాయి. వీటి నుండి చీము, రక్తం కారుతుంది. మంకీపాక్స్ వివిధ మార్గాల ద్వారా మనుషులకు సోకుతుంది. అయితే ఇది సోకిన వెంటనే దాని ప్రభావాన్ని చూపదు. ఈ వైరస్ మొదట శరీరమంతా వ్యాప్తి చెందుతుంది. అందు కోసం కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఏ లక్షణాలూ ఉండవు కాబట్టి.. మంకీ పాక్స్ సోకినట్లు గుర్తించలేరు. మంకీ పాక్స్ సోకిన తర్వాత 14 నుండి 21 రోజుల తర్వాత లక్షణాలు చాలా మందిలో మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించవు.. కానీ, శరీరంపై చిన్న చిన్న సైజుల్లో బొబ్బలు కనిపిస్తాయి.
మంకీపాక్స్ వ్యాప్తి ఇలా...
మంకీపాక్స్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే అత్యంత సమీపంగా ఉండి దగ్గినప్పుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్లను పీల్చుకోవడం ద్వారా.... తాకడం, ముద్దు పెట్టుకోవడం, కరచాలనాలు, చెమట, కన్నీళ్లీ, తదితర స్రావాలు, లైంగిక సంపర్కం, బాదితుడు ఉపయోగించిన తువ్వాలు, దుస్తులు వంటివి వాడటం ద్వారా వ్యాప్తి చెందుతుంది. అయితే వ్యాధి నిర్ఘారణ అయిన వారిని విడి గదిలో ఉంచడంతో పాటు సన్నిహితంగా మెలగకూడదు. లక్షణాలను బట్టి చికిత్స అందిస్తారు. మంకీపాక్స్ పై ఏవైనా అనుమానాలు ఉంటే 90302 27324 నంబర్ కు వాట్సాప్ చేస్తే... పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. నేరుగా ఫోన్ చేయాలనుకుంటే... 040 24651119 నంబర్ కు కాల్ చేయాలని ప్రజారోగ్య సంచాలకుడు సూచించారు.
ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు
Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్
By Election Fever : నాడు ఉపఎన్నికలే బ్రహ్మాస్త్రం - నేడు వాటితోనే గండం ! టీఆర్ఎస్కు "ఆర్" ఫ్యాక్టర్ ఫికర్ !
Hyderabad Traffic Today: వాహనదారులకు అలర్ట్! నేడు ఈ రూట్స్లోకి నో ఎంట్రీ, భారీ ట్రాఫిక్ జామ్! వేరే మార్గాలివీ
హైదరాబాద్లో నెంబర్ ప్లేట్ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!
India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?
Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam
A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan
Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam