Police Transfer: తెలంగాణలో 95 మంది డీఎస్పీల బదిలీ, 3 రోజుల్లోనే అంత మంది ట్రాన్స్‌ఫర్ అయ్యారా?
Telangana Police News: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులను భారీ సంఖ్యలో బదిలీ చేసింది. రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 250కి పైగా పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు.
TS Police DSP Transfer: హైదరాబాద్: తెలంగాణలో గత ఏడాది చివర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీలపై ఫోకస్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇదివరకే గత ప్రభుత్వం నియమించిన కీలక నామినేటెడ్ పోస్టులను రద్దు చేసింది. వరుసగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇటీవల 12 మంది ఐపీఎస్, దాదాపు 150 మంది వరకు డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్థానాల్లోకి బదిలీ చేసింది. తాజాగా మరో 95 మంది డీఎస్పీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 250 మందికి పైగా పోలీస్ ఉన్నతాధికారుల స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి.
బదిలీ అయిన డీఎస్పీల జాబితా ఇదే
హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం సాయంత్రం 12 మంది పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా పోలీసు శాఖలో దాదాపు 150 మంది అధికారులు బదిలీ అయ్యారు.
110 మంది డీఎస్పీలను హోంశాఖ బదిలీ చేసింది. వారితో పాటు ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 39 మంది అదనపు ఎస్పీలను సైతం వేరే స్థానానికి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
12 మంది ఐపీఎస్‌ల బదిలీ
రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న 12 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-2 ఐజీగా సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్థానంలో తరుణ్ జోషిని నియమితులయ్యారు. డిప్యూజీ ఐజీ శ్రీనివాసులను రామగుండం కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఎల్ఎస్ చౌహాన్ ను జోగులాంబ జోన్ 7 డీఐజీగా నియమించింది. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్‌కు పోస్టింగ్ ఇవ్వగా.. కే నారాయణ్ నాయక్ కు సీఐడీ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు.