అన్వేషించండి
Advertisement
Telangana News: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ - ఒకే రోజు 44 మందికి స్థానచలనం
IAS Transfer: తెలంగాణ ప్రభుత్వం సోమవారం భారీగా ఐఏఎస్‌ల బదిలీ చేపట్టింది. 44 మంది అధికారులను స్థానచలనం కల్పించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి నియమితులయ్యారు.
Telangana Government Tranferred IAS Officers: తెలంగాణ ప్రభుత్వం సోమవారం భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఒకే రోజు 44 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన అధికారులు వీరే
- జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి, పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
- కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌ను నియమించారు.
- జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి.. చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శితో పాటు హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా శైలజా రామయ్యను నియమించారు.
- ట్రాన్స్‌కో సీఎండీగా రొనాల్డ్ రాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ నియమితులయ్యారు.
- HMDA కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, GHMC EVDM కమిషనర్‌గా ఏవీ రంగనాథ్, కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పతి నియమితులయ్యారు.
- ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు.
- హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవి
- రవాణా శాఖ కమిషనర్‌గా కే.ఇలంబరితి.. జీహెచ్ఎంసీ, విజిలెన్స్, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్.
- జలమండలి ఎండీగా కే.అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహా శబరి
- జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి, జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ చౌహాన్.
- జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హెచ్‌కే పాటిల్, జీహెచ్ఎంసీ శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్‌గా ఉపేందర్ రెడ్డి.
- కళాశాల, సాంకేతిక విద్యా శాఖల కమిషనర్‌గా శ్రీ దేవసేన, సెర్ఫ్ సీఈవోగా డీ.దివ్య.. ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు.
- రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా ఎన్.ప్రకాశ్ రెడ్డి.
- ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్ వర్షిణి, ఐటీ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రా నియమితులయ్యారు.
- కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జీ.రవి, గ్రామీణాభివృద్ధి సీఈవోగా కే.నిఖిల, ఉద్యానవన డైరెక్టర్‌గా యాస్మిన్ భాషా. ఆయిల్ ఫెడ్ ఎండీగా యాస్మిన్‌కు అదనపు బాధ్యతలు
- ప్రోటోకాల్ డైరెక్టర్‌గా ఎస్.వెంకట్రావు.. వ్యవసాయ, సహకార సంయుక్త కార్యదర్శిగా జీ.ఉదయ్ కుమార్.
- పిషరీస్ డైరెక్టర్‌గా ప్రియాంక, టూరిజం డైరెక్టర్‌గా ఐలా త్రిపాఠి, రాష్ట్ర ఆర్థిక సంఘం ఎండిగా కాత్యాయని దేవి
- పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నర్సింహారెడ్డి, ఆయనకు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
- వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య
- భద్రాచల ఐటీడీఏ పీవోగా రాహుల్, మూసీ అభివృద్ధి జేఎండీగా గౌతమి, టీడీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది.
Also Read: Revanth Delhi Tour : ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు - కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
కర్నూలు
ఆట
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion