అన్వేషించండి

22A Land Issue Solved: 22ఏ భూముల చిక్కుముడి వీడింది.. రాష్ట్రంలో లక్షలాది ఇళ్లు, ప్లాట్లకు శాశ్వత విముక్తి!

22A Land Issue Solved: దశాబ్దాల సమస్యకు పరిష్కారం దొరికింది. 22ఏ జాబితాలో చేర్చిన భూములకు తెలంగాణ ప్రభుత్వం విముక్తి కల్పిస్తుంది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ ప్రభుత్వం 22ఏ నిషేధిత భూముల చిక్కుముడిని విముక్తం చేసింది.
  • సుమారు 1.41 లక్షల ఆస్తులకు, 300 కాలనీలకు ఉపశమనం లభించనుంది.
  • చట్టబద్ధ అనుమతులు, లింక్ డాక్యుమెంట్లు సమర్పించడం తప్పనిసరి అవుతుంది.
  • సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు, ఫాస్ట్‌ట్రాక్ విధానం ఏర్పాటు చేశారు.

22A Land Issue Solved: ఏళ్ల పాటు లక్షలాది మంది మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిషేధిత భూముల 22A చిక్కుముడికి తెలంగాణ ప్రభుత్వం విముక్తి కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా కాలం నుంచి 22ఏ జాబితాలో కొనసాగుతున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు విముక్తి కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. తాజాగా ఉత్తర్వులు అమల్లోకి వచ్చింది. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర్‌ రాజనర్సింహ, వివేక్‌లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌..22ఏ భూములపై కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

సుమారు 1.41 లక్షల ఆస్తులకు విముక్తి

హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో సుమారు 300 కాలనీల్లోని 1.41 లక్షల ఇళ్లు, ప్లాట్లకు ఈ ఉత్తర్వులతో ఉపశమనం లభించనుంది. కేవలం రంగారెడ్డి జిల్లాలోనే 44, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 65 కాలనీలు ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోర్టు కేసుల తీర్పులు, భూముల వేలం, క్రమబద్ధీకరణల అనంతరం ఏర్పడిన కాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి వివరాలు ఆన్‌లైన్ రికార్డుల్లో అప్‌డేట్ కాకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. హైకోర్టు ఆదేశాలతో గత ఏడాది 22ఏ జాబితాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు కొన్ని నివాసిత ప్రాంతాలు కూడా పొరపాటున ఇందులో చేర్చారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.

Also Read: తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా మళ్లీ సునీల్ బన్సల్ - కాంగ్రెస్ vs బీజేపీ ఫైట్‌కు సరికొత్త స్కెచ్.. మిషన్ తెలంగాణ సాధ్యమేనా?

తాజా ఆదేశాల్లో కీలక అంశాలు 

  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ స్థానిక సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు 22ఏ జాబితా నుంచి తొలగిస్తారు. 
  • దరఖాస్తుదారులు ప్రభుత్వ సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే లేఅవుట్, భవనం లేదా అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతి పత్రాలను సమర్పించాలి.
  • అనుమతుల అనంతరం రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదో ఒక లింక్ డాక్యుమెంట్‌ను చూపించాల్సి ఉంటుంది.
  • ఏవైనా ప్రత్యేక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.
  • పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు మాత్రం ఆయాన్యాయస్థానాల తుది తీర్పులకు లోబడి ఉంటాయి.

Also Read: గణేష్ నిమజ్జనం.. మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. నేడు వైన్స్ షాపులు బంద్

ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కారం- మంత్రి పొంగులేటి

దశాబ్దాలుగా ప్రజలను వేధిస్తున్న ఈ సమస్యను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించినట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని కాలనీల క్రమబద్ధీకరణకు జీవో 118, సింగరేణి కార్మికుల కోసం జీవో 76 జారీ చేశామని గుర్తుచేశారు. భూమి స్వభావం, రికార్డులను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిష్కారం చూపిస్తామని  ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర లైవ్ ఇక్కడ చూడండి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Frequently Asked Questions

22A భూముల సమస్య అంటే ఏమిటి?

ఆన్‌లైన్ రికార్డులలో అప్‌డేట్ కాకపోవడం వల్ల, కోర్టు తీర్పులు లేదా క్రమబద్ధీకరణల అనంతరం ఏర్పడిన నివాసిత ప్రాంతాలు పొరపాటున 22ఏ జాబితాలో చేర్చబడ్డాయి. దీనివల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఈ ఉత్తర్వుల ద్వారా ఎన్ని ఆస్తులకు లబ్ధి చేకూరింది?

సుమారు 300 కాలనీలలోని 1.41 లక్షల ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు ఈ ఉత్తర్వులతో విముక్తి లభించింది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలు ప్రధానంగా లబ్ధి పొందాయి.

22ఏ భూముల సమస్య పరిష్కారానికి ఉత్తర్వులను ఎవరు జారీ చేశారు?

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఈ కీలక ఉత్తర్వులను జారీ చేశారు.

22ఏ జాబితా నుండి ఆస్తిని తొలగించడానికి అవసరమైన పత్రాలు ఏమిటి?

ప్రభుత్వ సంస్థల నుండి చెల్లుబాటు అయ్యే లేఅవుట్, భవనం లేదా అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతి పత్రాలు సమర్పించాలి. అనుమతుల అనంతరం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్‌ను చూపాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget