అన్వేషించండి

22A Prohibited Lands Issue: 22ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి హైలెవెల్ కమిటీ ఏర్పాటు, చైర్మన్‌గా ఎవరంటే

22A Prohibited Lands | 22ఏ నిషేధిత భూముల సమస్యను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించేందుకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం హైలెవెల్ కమిటీన ఏర్పాటు చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 22ఏ నిషేధిత భూముల వివాద పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు.
  • సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
  • కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం ఆదేశాలు.

హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన, రాజకీయంగానూ వివాదాస్పదంగా ఉన్న 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ నిషేధిత భూముల జాబితాలో తలెత్తుతున్న వివాదాలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

హైలెవెల్ కమిటీ చైర్మన్, సభ్యులు వీరే

ఈ మేరకు ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ హైలెవెల్ కమిటీకి సీసీఎల్‌ఏ (CCLA) కమిషనర్ లోకేష్ కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, సభ్యులుగా అధికారులు పాపిరెడ్డి, రాజీవ్ గాంధీ హనుమంతు బాధ్యతలు నిర్వర్తిస్తారు. భూ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనుంది.

ధరణి పోర్టల్ ద్వారా విదేశీయుల చేతుల్లోకి మన భూముల లెక్కలు

తెలంగాణలో అటవీ, అసైన్డ్, దేవాదాయ శాఖలకు చెందిన 1 కోటి 2 లక్షల ఎకరాలు 22ఏ నిషేధిత జాబితాలోనే ఉంటాయని, వీటిని తొలగించే అధికారం మంత్రులకు కూడా లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సభలోనే స్పష్టం చేశారు. నిజాం కాలం నాటి భూ సమస్యలపై చర్చ జరగాలని అభిప్రాయపడిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా 2.50 కోట్ల ఎకరాల భూముల వివరాలు విదేశీ మాఫియా చేతికి వెళ్లాయని, మన రైతుల భూముల వివరాలు విదేశీయుల వద్ద ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయడం, అధికారుల పొరపాట్ల వల్ల ప్రైవేట్ భూములు 22ఏలో చేరడం వల్ల వివాదాలు ముదిరాయని పేర్కొన్నారు.

కల్వకుంట్ల కుటుంబం ఆస్తులపై రేవంత్ రెడ్డి కామెంట్స్

22ఏ జాబితాలో 12 అంశాలను గుర్తించామని, సభ్యుల సూచనలతో పేదలకు న్యాయం చేస్తామన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఈ భూసమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమకారులు సర్వస్వం కోల్పోతే, కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్లు, వందల ఎకరాలు సంపాదించిందని సీఎం రేవంత్ మండిపడ్డారు.

కల్వకుంట్ల కుటుంబం, వారి బంధువుల పేరిట 9 జిల్లాల పరిధిలో ఉన్న 439.30 ఎకరాల భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కేసీఆర్ సహా కుటుంబసభ్యులకు ఎవరి పేరిట ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అసెంబ్లీలో చదివి వినిపించారు. ముఖ్యంగా కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్‌ భూమిలో ప్రభుత్వ భూములతో పాటు రైతుల నుంచి లాక్కున్న భూములు ఉన్నాయని, దీనిపై 30 రోజుల్లో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని సిద్దిపేట కలెక్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం పేరిగ సైతం వందల ఎకరాల భూములు ఉన్నాయని, త్వరలోనే అన్ని లెక్కలు ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్, హరీష్ రావు అన్నారు.

Also Read: KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?

Frequently Asked Questions

22ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏమి చేసింది?

తెలంగాణ ప్రభుత్వం 22ఏ నిషేధిత భూముల జాబితాలో తలెత్తుతున్న వివాదాలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

హైలెవల్ కమిటీలో ఛైర్మన్ మరియు సభ్యులు ఎవరు?

ఈ హైలెవల్ కమిటీకి సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, పాపిరెడ్డి మరియు రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

22ఏ జాబితా నుండి ఏ భూములను తొలగించలేమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు?

అటవీ, అసైన్డ్, దేవాదాయ శాఖలకు చెందిన 1 కోటి 2 లక్షల ఎకరాలను 22ఏ నిషేధిత జాబితాలో ఉంటాయని, వీటిని తొలగించే అధికారం మంత్రులకు కూడా లేదని సీఎం స్పష్టం చేశారు.

ధరణి పోర్టల్ గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా 2.50 కోట్ల ఎకరాల భూముల వివరాలు విదేశీ మాఫియా చేతికి వెళ్లాయని సీఎం ఆరోపించారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వివాదాలు ముదిరాయన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Embed widget