Liquor shops: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా నేడు వైన్స్ షాపులు బంద్
Ganesh Immersion | తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పోలీసులు హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగుతోంది. శాంతియుత వాతావరణంలో, ప్రశాంతంగా సాగేందుకు వీలుగా పలు జిల్లాల పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో మద్యం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి శనివారం (సెప్టెంబర్ 26) ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లు అన్నింటినీ పూర్తిగా మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆంక్షల అమలు ద్వారా నిమజ్జనోత్సవాల సమయంలో ఎలాంటి శాంతిభద్రతల విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, ఈ వైన్ షాపులు మరియు బార్ల మూసివేత నిబంధన నుంచి స్టార్ హోటళ్లకు, అలాగే అధికారికంగా రిజిస్టర్ అయిన క్లబ్బులకు మాత్రమే అధికారులు మినహాయింపునిచ్చారు.
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
మరోవైపు హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. బాహుబలి క్రేన్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర చాలా ఆలస్యంగా మొదలైంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర దాదాపు 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. భక్తులు శోభాయాత్రల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నీళ్ల లోతు తెలియకుండా లోపలకి వెళ్లే ప్రయత్నం చేయకూడదని, ఈత రానివాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ట్రెండింగ్ వార్తలు






















