News
News
వీడియోలు ఆటలు
X

తెలంగాణలో ఇకపై అర్థరాత్రి కూడా షాపింగ్‌- గుడ్‌ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

తెలంగాణలో రాత్రి పగలు షాపింగ్ చేసుకోవచ్చు. షాపులు, షాపింగ్ మాల్స్‌ 24X7 తెరిచి ఉంచేలా ఆదేశాలు వచ్చేశాయి.

FOLLOW US: 
Share:

తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలు తెరిచేలా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వ్యాపార వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. 

కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని పేరుతో విడుదలైన జీవో ప్రకారం తెలంగాణలో షాపింగ్ మాల్స్‌, దుకాణాలు 24 గంటలూ తెరిచేలా అనుమతి ఇచ్చారు. దీని కోసం ఏటా ప్రభుత్వానికి పదివేల రూపాయలు చెల్లించాలి. తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1988కు సవరణలు చేసిన ప్రభుత్వం ఈ మేరకు 24 గంటలు షాపులు తెరిచేలా అనుమతి ఇచ్చారు. 

ఇలా 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు షాపులు, షాపింగ్ మాల్స్‌ నిర్వాహకులు కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సిబ్బందికి ఐడీ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వారికి వీక్లీహాలిడేస్ మస్ట్‌గా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. కచ్చితమైన పని గంటల్లో వారితో పని చేయంచుకోవాలి. ఓవర్‌ టైం చేస్తే మాత్రం ప్రత్యేక వేతనం ఇవ్వాలి. పండగలు, సెలవు దినాల్లో పని చేసేవారికి కాంపెన్సేటరీ లీవులు కూడా ఇవ్వాలి.

మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వేతనం ఇవ్వాలి. రాత్రి షిఫ్టులో పని చేసేందుకు అంగీకరిస్తేనే మహిళలకు డ్యూటీలు వేయాలి. వారికి తగిన భద్రత కల్పించాలి. వారికి రవాణా సౌకర్యం కూడా కల్పించాలి. రికార్డులను సరిగా నిర్వహించాలి. పోలీస్‌ యాక్ట్ రూల్స్ మస్ట్‌గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఉంటే తప్ప అలాంటి షాపులను 24 గంటలూ తెరిచేలా అనుమతులు ఇవ్వబోరు. 

Published at : 08 Apr 2023 06:51 AM (IST) Tags: Telangana News Telangana Shops

సంబంధిత కథనాలు

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!

టాప్ స్టోరీస్

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!