అన్వేషించండి

Ayodhya Saryu River: అయోధ్య సరయూ నదిలో జనగామ జిల్లా యువతి గల్లంతు

Ayodhya Ram Mandir: అయోధ్యను సందర్శించేందుకు తెలంగాణ నుంచి వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. రాములోరి దర్శనానంతరం స్నానం చేస్తుండగా జనగామ పట్టణానికి చెందిన తేజశ్రీ అనే యువతి కొట్టుకుపోయింది.

Ayodhya Saryu River: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యను సందర్శించేందుకు తెలంగాణ నుంచి ఓ కుటుంబం వెళ్లింది. దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.  సరయూ నదిలో ఆ కుటుంబానికి చెందిన యువతి గల్లంతు అయింది.  జనగామకు చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య సందర్శనకు వెళ్లారు.  రాములోరి దర్శనం అనంతరం సరయూ నదిలోకి పుణ్య స్నానాలు చేసేందుకని వెళ్లారు. ఈ నెల 29న సరియూ నదిలో లక్ష్మి ఘాట్ వద్ద స్నానాలు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా వరద ఉధృతి పెరగడంతో  నాగరాజు కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతు అయ్యారు. అందులో నలుగురిని స్థానికులు సురక్షితంగా రక్షించగా తేజశ్రీ అనే యువతి వరదలో కొట్టుకు పోయింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో  అక్కడి రెస్క్యూ టీం నిన్నటి నుండీ గాలింపు చర్యలు చేపట్టారు. తేజశ్రీ జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతుంది.  

ఆనందం ఆవిరి
దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లాకు చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం జులై 28న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య సందర్శనకు వెళ్లారు. జులై 29న దైవ దర్శనం కోసం కుటుంబ సమేతంగా సరయు నదిలో స్నానాలు చేస్తుండగా... ఐదుగురు అమ్మాయిలు గల్లంతయ్యారు. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్న వారు ఒక్కసారే ఐదుగురు గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. వెంటనే స్థానికులు అప్రమత్తమైన నదిలో దూకి యువతులను కాపాడేందుకు ప్రయత్నించారు.

జాగ్రత్తగా ఉంటానని చెప్పి..
స్నానం కోసం నదిలో దిగిన  నలుగురు అమ్మాయిలను ప్రాణాలతో కాపాడగలిగారు. వారితో వెళ్లిన తేజశ్రీని మాత్రం కనుగొనలేకపోయారు. నిన్నటి నుంచి రెస్క్యూ టీం తేజశ్రీ కోసం వెతుకుతూనే ఉన్నారు.  తేజశ్రీ గల్లంతై 24 గంటలు కావొస్తున్న ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు తేజశ్రీని గాలిస్తున్నామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కూతురు తేజశ్రీ ఎంతో చలాకీగా ఉంటుందని... స్నానానికి వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తగా ఉంటానని చెప్పి వెళ్లి ఇప్పుడు కనిపించకుండా పోయిందని వాపోయారు. విషయాన్ని కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. యూపీ అధికారులతో వారు మాట్లాడారు. యువతి  జాడ కోసం లక్ష్మణ్‌ ఘాట్‌ వద్దే కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు.  

జనవరి 22న ప్రాణ ప్రతిష్ట
ఉత్తర్ ప్రదేశ్‌లోని అయ్యోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణం జరిగింది. 2024 జనవరి 22న ప్రధాన మోదీ చేతుల మీదుగా రామ మందిరంలో రాములోరి  ప్రాణ ప్రతిష్ట జరిగింది. భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రతి హిందువులంతా ఆ ఆనంద క్షణాలు వీక్షించి పులకించారు. ప్రతి రోజూ అయోద్యకు లక్షలాది మంది భక్తులు వెల్లి బాలరాముడిని దర్శించుకుంటున్నారు. రామ మందిరంతో పాటు అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలు తిలకించి వస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
తెలంగాణలో కరెంట్ కష్టాలు - రూ.5,420 కోట్ల ట్రూ-అప్ షాక్ - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోగలదా?
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget