అన్వేషించండి

Telangana formation Day : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది ఇదే !

ఎనిమిదేళ్లలో తెలంగాణ వృద్ధి వైపు పయనం సాగించింది. అన్ని రంగాల్లోనూ ముందంజ వేసింది. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయిన సందర్భంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక కథనం.

Telangana formation Day : ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని అప్పట్లో నిపుణులు విశ్లేషించారు. తెలంగాణలో కరెంట్ ఉత్పత్తి తక్కువ కావడంతో కరెంట్ సమస్య నుంచి అనేక రకాల సమస్యలు వస్తాయని అంచనా వేశారు. కానీ ఎనిమిదేళ్లలో తెలంగాణ అద్భుతంగా పురోగమించింది. నీతి ఆయోగ్  అర్థనీతి పేరుతో విడుదల చేసిన నివేదికల్లో తెలంగాణ  అభివృద్ధి స్వరూపం కళ్ల ముందు ఉంటుంది.
Telangana formation Day : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది ఇదే !

విడిపోయిన తర్వాత తెలంగాణ అనూహ్య ప్రగతి 

తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి అనూహ్యమైన ప్రగతిని సాధించింది.  2015 -16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అంటే.. ఉమ్మడిగా ఉన్న ఆ ఆర్థిక సంవత్సరం మినహా మిగిలిన ఆర్థిక సంవత్సారాల్లో ఆర్థిక వృద్ధి 11 శాతానికి పైగా ఉంది. రాష్ట్రం విడిపోక ముందే తెలంగాణలో తొమ్మిది శాతాని కంటే తక్కువగానే వృద్ధి రేటు ఉండేదని లెక్కలు చెబుతున్నాయి. అంతే కాకుండా…   అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్‌ తేల్చింది. జీఎస్‌డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ భారీగా జీఎస్డీపీని అందిస్తున్నాయి. అదే సమయంలో టెక్స్‌టైల్స్, లెదర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, మినరల్స్‌ వంటి సంప్రదాయ రంగాలు కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇక ఫార్మా రంగంలో తెలంగాణను లీడర్‌గా నీతి ఆయోగ్ తెలిపింది. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్‌ వాటా 20 శాతంగా ఉంది. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయని .. సాధారణ టూరిజంతో పాటు మెడికల్ టూరిజం కూడా హైదారబాద్‌లో భారీగా వృద్ధి చెందుతోందని ప్రకటించారు.
Telangana formation Day : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది ఇదే !

ఆర్థికాభివృద్ధిలో నెంబర్ వన్ 


ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణ జీఎస్‌డీపీ ఏడేళ్లలోనే రెట్టింపు అయింది.  వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ 18.5 శాతం అద్భుత ప్రగతి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో ఇది 6.6శాతం మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్‌డీపీ 93.8 శాతం పెరిగింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణలో దేశంలోనే ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండో స్థానంలో ఉండేది.
Telangana formation Day : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది ఇదే !

అయిదు రెట్లు పెరిగిన ధాన్యం ఉత్పత్తి !

ధాన్యం ఉత్పత్తి ఏడేళ్లలో అయిదు రెట్లు పెరగింది. అంటే సాగునీటి లభ్యత పెరిగిందని అర్థం. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి కార్యాచరణతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీడీపీలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌, నీటి పారుదల రంగాల్లో తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే మెరుగైన అభివృద్దిని చూపిస్తోంది. తెలంగాణ అభివృద్ధిని కరోనా కూడా ఆపలేకపోయింది. కరోనా కారణంగా దేశ జీడీపీ 3 శాతం తగ్గగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2.4 శాతం పెరిగింది. విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, ఐటీ రంగంలో పెట్టుబడులు పెరగడంతో ఇతర రంగాల్లోనూ మంచి అభివృద్ధి నమోదు అయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి కంటే విడిపోయిన తర్వాత తెలంగాణ అద్భుత ప్రగతి సాదిస్తోందని బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్నామని.. దానికి అభివృద్ధే సూచిక అని ప్రభుత్వం చెబుతోంది.
Telangana formation Day : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించింది ఇదే !

కాళేశ్వరంతో సాగు నీరు - మిషన్ భగీరథతో తాగు నీరు ! 

అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం.  కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చామని టీఆర్ఎస్ ప్రకటించుకుంది.  నల్లగొండ ఫ్లోరోసిస్‌ సమస్ తీరిపోయింది.  పుట్టినప్పటి నుంచి జీవితాంతం మనిషి అవసరాలకు ప్రభుత్వపరంగా తోడ్పాటు అందించాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన. ఆ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజన జరగడంతో పాలన ప్రజల వద్దకు వచ్చింది. భూ రికార్డుల ప్రక్షాళన వల్ల వివాదాలు తగ్గిపోయి, భూములకు భద్రత లభిస్తున్నది. విద్య, వైద్యం, పర్యావరణం వంటి ఏ రంగంలోనైనా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలంగాణ సర్కార్ ప్రకటించుకుంది.

  

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget