అన్వేషించండి
Advertisement
Telangana Elections 2023: రెండో విడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం కేసీఆర్ - షెడ్యూల్ ఇదే
CM KCR: సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. 3 రోజుల బ్రేక్ అనంతరం సోమవారం నుంచి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.
CM KCR Second Round Praja Ashiravada Sabha: తెలంగాణలో రెండో విడత ప్రచారానికి గులాబీ బాస్ సిద్ధమయ్యారు. 3 రోజుల బ్రేక్ తర్వాత సోమవారం నుంచి రెండో విడత ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సభలకు హాజరై బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీలే లక్ష్యంగా, తాము చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. నవంబర్ 9న కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం అక్కడ సభతో తొలి విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా, మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. ప్రతి రోజూ 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. 16 రోజులు 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
షెడ్యూల్ ఇదే
- ఈ నెల 13న సోమవారం బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. భద్రాచలం, పినపాక కలిపి ఒకే సభ ఉండనుంది.
- 14న పాలకుర్తి, నాగార్జునసాగర్ (హాలియా), ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజమాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ సభల్లో పాల్గొంటారు.
- 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్, 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల సభల్లో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.
- 18న చేర్యాల (జనగాం)లో రోడ్ షో, 19న ఆలంపూర్, కల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
- 20న మానకొండూరు, స్టేషన్ ఘన్పూర్, నకిరేకల్, నల్లగొండ, 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటలో సభలు ఉండనున్నాయి.
- 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరువు.
- 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 25న హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్, 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక.
- 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి, 28న వరంగల్(ఈస్ట్+వెస్ట్), గజ్వేల్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement