అన్వేషించండి

Telangana Elections 2023 : నామినేషన్ల ఘట్టానికి సర్వం సిద్ధం - శు్కరవారం ఉదయమే నోటిఫికేషన్ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Telangana Elections 2023 :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మైన నామినేషన్ ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ లు వేసేందుకు మూడో తేదీ నుండి 10 తారీకు వరకు అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో  యంత్రాంగం నామినేషన్ ప్రక్రియ కు జిల్లా వ్యాప్తంగా నామినేషన్ సెంటర్ లను సిద్ధం చేసింది.  రెవెన్యూ ,పోలీస్ శాఖ వారి సమన్వయం తో పటిష్ఠమైన భద్రత తో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాలు విధి విధానాల పై రాజకీయ నాయకులకు ,పార్టీ ప్రతినిధులు  ముందస్తుగానే అవగాహన కార్యక్రమాలు కల్పించారు  . అభ్యర్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్రాల్లో సహాయక సెంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు.  

శుక్రవారం ఉదయం నోటిఫేషన్ - వెంటనే నామినేషన్ల స్వీకరణ 

 రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల  కార్యాలయాలను సిద్ధంచేసింది. ఆయా కార్యాలయాల్లో 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 5వ ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు తీసుకోరు. ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తే వారికి స్లిప్‌లు ఇచ్చి అందరూ నామినేషన్లు వేసే అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మంచి రోజులు ఉన్నాయని సమాచారం. ఈ మూడు రోజుల్లోనే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లన్లు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. నామినేషన్‌ రోజు నుం చి ఎన్నికల ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు.

జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.10 వేల డిపాజిట్‌

రాష్ట్రంలో ఎక్కడ ఓటు ఉన్నా అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. అయితే ఆయనను బలపరిచే వారు మాత్రం స్థానిక నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈ సారి ఈ నామినేషన్లలో మార్పులు చేసింది. అఫిడవిట్‌ను అసంపూర్తిగా నింపి ఇస్తే దానికి ఆర్‌వో నోటీసులు జారీ చేస్తారు. అభ్యర్థి దానిని సవరించాల్సిందిగా సూచిస్తారు. అప్పటికీ అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్‌ను తిరస్కరించే అధికారం ఆర్‌వోకు ఉన్నది. నామినేషన్‌ దాఖలు చేయడానికి జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు ధరావత్తు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఓట్లు తెచ్చుకుంటే డిపాజిట్ తిరిగి ఇస్తారు. 

కొన్ని సీట్లలో మినహా అభ్యర్థలను ఖరారు చేసిన పార్టీలు

 అన్ని రాజకీయ పార్టీలు సెకండ్, థర్డ్ లిస్టులు రిలీజ్ చేశాయి. కొన్ని సీట్లలో మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గర పడుతుండటంతో.. అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసి.. బీఫాంలు ఇవ్వాలని నిర్ణయించాయి. సమయం ఎక్కువగా లేకపోవటంతోపాటు ప్రచారంపై దృష్టి పెట్టటానికి రెడీ అవుతున్నాయి పార్టీలు. టికెట్ రాని అభ్యర్థుల బుజ్జగింపులతోపాటు పొత్తుల్లోని పార్టీలతో చర్చలను.. వీలైనంత త్వరగా ముగించాలని డిసైడ్ అయ్యాయి. ఈ క్రమంలోనే నామినేషన్ల గడువు అయిన నవంబర్ 3వ తేదీని దృష్టిలో పెట్టుకుని..  అన్ని పార్టీలు పెండింగ్.. అభ్యర్థులను ప్రకటించే పనిలో కసరత్తులు చేస్తున్నాయి.

ఎన్నికల్లో కీలక తేదీలు ఇవే 

నోటిఫికేషన్ తేదీ - నవంబర్ 03
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ - నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన - నవంబర్ 13
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ - నవంబర్ 15
నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. 
కేవలం ఐదు మంది మాత్రమే నామినేషన్ కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది.
పోలింగ్ - నవంబర్ 30
ఓట్ల లెక్కింపు - డిసెంబర్ 03

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Embed widget