అన్వేషించండి

Telangana Elections 2023: కేసీఆర్ చెప్పినట్లే తెలంగాణ నెంబర్ 1, ఆ విషయాల్లో మాత్రమేనంటూ రేవంత్ రెడ్డి కౌంటర్

TPCC Chief Revanth Reddy: సీఎం కేసీఆర్ చెప్పినట్లే తెలంగాణ నెంబర్ 1 అని, అయితే రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1 అని, నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్ అని సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

Telangana Assembly Elections 2023 : నర్సాపూర్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకేరోజు మూడు నుంచి నాలుగు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొని తమ పాలనలో తెలంగాణ ఎన్నో విషయాల్లో నెంబర్ వన్ అయిందని చెబుతున్నారు. తెలంగాణ నెంబర్ 1 అనే కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లే తెలంగాణ నెంబర్ 1 అని, అయితే రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1 అని, నిరుద్యోగ సమస్యల్లో రాష్ట్రం నెంబర్ వన్ అని సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. తాగుబోతుల అడ్డాగా దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణను మార్చిన ఘనత సీఎం కేసీఆర్ సొంతమన్నారు.

నర్సాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొందరు నేతలు పదవుల కోసం అమ్ముడుపోయినా, కార్యకర్తలు మాత్రం పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చారు. పార్టీ ఫిరాయించిన ఒక నమ్మకద్రోహికి బీఆర్ఎస్ ఇక్కడ టికెట్ ఇచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ ను చార్మినార్ జోన్ లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటుంది. నర్సాపూర్ లాంబాడి సోదరుల అడ్డా అని, లాంబాడాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నర్సాపుర్ పరిధిలోని లంబాడా తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామన్న సీఎం కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తానని చెప్పి.. తాగుబోతుల అడ్డాగా, రైతుల ఆత్మహత్యల్లో, నిరుద్యోగ సమస్యల్లో తెలంగాణను నెంబర్ వన్ చేశారంటూ సీఎం కేసీఆర్ పాలనను విమర్శించారు. అమ్ముడుపోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ అంటుండు.. మన లాంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ ఇందిరమ్మదేనన్నారు. తండాల్లో, మారుమూల పల్లెల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. భూమి అంటే ఆత్మగౌరవం అని, 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని పేర్కొన్నారు. 

దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేశాం. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించింది కాంగ్రెస్. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించాం. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడక్కు తినేదంటూ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ గా కేసీఆర్ కు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ కాదా? అని రేవంత్ ప్రశ్నించారు.

తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి కేసీఆర్
గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిన్ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కుమారుడు అనే సంగతి మరిచిపోయావా కేసీఆర్?. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కేసీఆర్ కు ప్రజలు బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోందని, రాచరిక పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ పాపం పండింది, ఆయన పాలనకు కాలం చెల్లింది. కేసీఆర్ ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసింది. తెలంగాణలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేస్తాం, ఈ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Embed widget