అన్వేషించండి

KCR in Paleru: తుమ్మల వల్లే BRSకు అన్యాయం, పాలేరు సభలో పొంగులేటిపైనా కేసీఆర్ ఫైర్

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద నిర్వహించారు. ఈ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

రైతు బంధు దుబారా అని, అది వేస్ట్ అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రైతులకు మూడు గంటలే కరెంటు కావాలని ప్రస్తుత పీసీసీ చీఫ్ అంటున్నారని విమర్శించారు. పొరపాటున కనుక కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాం రాం, దళిత బంధుకు జై భీం, కైలాసం వైకుంఠపాళి ఆటలో పెద్దపాము మింగినట్లు అవుతుందని కేసీఆర్ వివరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద నిర్వహించారు. ఈ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

తుమ్మల వల్ల బీఆర్ఎస్‌కు అన్యాయం - కేసీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా తొక్కనివ్వబోమని పాలేరులోని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. నాలుగు కాంట్రాక్టులతో డబ్బులు సంపాదించి అహంకారంతో జనాల్ని కొనాలని అంటున్నారని చెప్పారు. ‘‘తుమ్మల నాగేశ్వరరావుకు నేను అన్యాయం చేశానని ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన ఖమ్మంలో అజయ్ చేతిలోనే ఓడిపోయారు. అయినా సీనియర్ నాయకుడని, ఎమ్మెల్సీ చేశాం, తర్వాత పాలేరులో ఎమ్మెల్యేగా చేయించాం, మంత్రి పదవి ఇచ్చాం. అయినా ఆయన చేసింది గుండు సున్నా. ఖమ్మంలో ఒక్క సీటు లేకుండా చేశాడు. బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? తుమ్మల బీఆర్ఎస్‌కు అన్యాయం చేశాడా? మీరే చెప్పాలి. అడ్డగోలుగా మాట్లాడితే బుద్ది చెప్పాల్సింది మీరే’’ అని కేసీఆర్ చెప్పారు.

‘‘ఉపేందర్ రెడ్డిని ఏకపక్షంగా గెలిపించుకోండి. మొత్తం నియోజకవర్గానికి దళిత బంధు పెట్టించే బాధ్యత నాది. హుజూరాబాద్ తరహాలో నేనే వచ్చి పథకం ప్రారంభిస్తా’’ అని అన్నారు. గిరిజనులను చులకనగా చేసి మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. నిన్న‌మొన్న‌టి దాకా కేసీఆర్ వ‌ల్ల మోక్షం వ‌చ్చింద‌ని నేతల నాలుక‌లు మాట్లాడాయని అన్నారు. ఆ న‌రం లేని నాలుక కాబ‌ట్టి వారు ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్నారని అన్నారు. న‌రం లేని నాలుక మారొచ్చు కానీ స‌త్యం మార‌దని.. నిజం నిజం లాగే ఉంటుందని అన్నారు.

ఎంఎస్ స్వామినాథన్ నుంచి ప్రశంసలు

తాను రైతుబంధు పథకానికి శ్రీకారం చుడితే ప్రముఖ వ్యవసాయవేత్త ఎంఎస్‌ స్వామినాథనే ప్రశంసించారని, శభాష్‌ చంద్రశేఖర్‌ బాగా చేశారంటూ కితాబిచ్చారని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని యూఎన్‌ఓ కూడా భేష్‌ అన్నదని, తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని కితాబు వచ్చిందని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు వచ్చిన తర్వాత ఇవాళ రైతుల పరిస్థితి తారుమారైందని.. వాళ్ల బ్యాంకు లోన్లు తీరిపోతున్నాయని అన్నారు. లోన్లు తీసుకునే అవసరం లేకుండా పోయిందని.. మునుపటి రోజుల్లో రెండు ఎరువు బస్తాలు కావాలంటే.. అప్పు తీసుకున్న వారికే ధాన్యం పోయడం.. అడిగిన ధరకే ఇవ్వడం ఉండేదని గుర్తు చేశారు.

ప్రస్తుతం కల్తీ విత్తనాలు అమ్మితే, ఆ అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టి జైళ్లలో పెడుతున్నాం. బ్రహ్మాండమైన పంటలతో ఏకంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండుతుంది. రాబోయే రోజుల్లో సీతారామ ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రాజెక్టు పాలేరుకు లింక్‌ కాబోతుంది. ఒకసారి వచ్చిందంటే సాగర్‌ కెనాల్‌ కింద ఉన్న ఆయకట్టుకు కూడా ఖమ్మం జిల్లాలో శాశ్వతంగా కరువు పీడ, నీళ్ల పీడ తొలగిపోతుంది’’ అని కేసీఆర్ చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget