అన్వేషించండి

Telangana Elections 2023 : జూబ్లిహిల్స్‌లో అజహర్‌కు రెబల్ బెడద - పోటీలో ఉంటానంటున్న మాజీ ఎమ్మెల్యే విష్ణు !

జూబ్లిహిల్స్‌లో పోటీలో ఉంటానని టిక్కెట్ దక్కని కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. పార్టీ తనకు అన్యాయం చేసిందన్నారు.

Telangana Elections 2023 :   కాంగ్రెస్‌లో టికెట్‌ ఆశించినా అది దక్కకపోవడంతో పీజేఆర్‌ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ జూబ్లీహిల్స్‌ టికెట్‌ను మాజీ క్రికెటర్‌, సీనియర్‌ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్‌ రెడ్డి శనివారం పార్టీ అనుచరులతో సమావేశం కానున్నారు. హైకమాండ్‌ తీరుపై విష్ణువర్ధన్‌ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు చాలా మందికి ఇచ్చారు. మాకెందుకు ఆ నిబంధన అడ్డు వచ్చిందని ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి సోదరి విజయారెడ్డికి ఖైరతాబాద్ టిక్కెట్ ను కాంగ్రెస్ కేటాయించింది.                   

తాను జూబ్లీహిల్స్‌లో గెలుస్తానని అన్ని రిపోర్టులు చెప్తున్నాయి. కావాలనే నాకు టిక్కెట్ ఇవ్వలేదని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  టికెట్‌ ఇస్తామని ఢిల్లీ పెద్దలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. కానీ, అనూహ్యంగా జాబితాలో నా పేరు లేకపోవడంతో నేనే షాక్‌ అయ్యానన్నారు.  పార్టీకి ఎవరు ముఖ్యమో అది ముందు గమనించాలి.   పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నారు. నేనే వేరే పార్టీలో చేరితే మంచి స్థానం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయన్నారు. ఎస్సీ, బీసీ, సెటిలర్స్ ఉన్న నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ కోసమే టిక్కెట్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.  ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తానని..  
ప్రజలకు దండాలు పెట్టేవారికి కాకుండా నాయకులకు దండాలు పెట్టేవారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ ఇచ్చారన్నారు.             

పార్టీకోసం కష్టపడ్డా,నని హైదరాబాద్‌లో కాంగ్రెస్ అంటే పీజేఆర్ అనేవాళ్ళు. జూబ్లీహిల్స్ నుండి పోటీలో ఉంటా, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. గతంలో మాజీ క్రికెటర్ జూబ్లీహిల్స్‌లోని పలు వేదికలపై సమావేశాలు నిర్వహించినప్పుడు, విష్ణువర్ధన్ రెడ్డి అజారుద్దీన్‌ను అలాంటి సభలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి 2004, 2009లో జూబ్లీహిల్స్‌ నుంచి గెలుపొందగా, 2014, 2018లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ చేతిలో ఓడిపోయారు. కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. రాహుల్ గాంధీ సభలకు కూడా హాజరు కాకపోవడంతో ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జరిగింది.            

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా ఆయన వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయనపై కూడా విమర్శలు చేశారు. చివరికి పార్టీ కోసం పని చేయలేదన్న కారణంగానే ఆయనను పక్కన పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. జూబ్లిహిల్స్ లో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో పాటు క్రికెట్ టీమ్ కెప్టెన్ గా పాపులారిటీ సాధించిన అజహర్‌కు అందరూ మద్దతు ఇస్తారని అందుకే ఆయనను నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.                            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan YSRCP Porubata: కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Porubata: కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Embed widget