అన్వేషించండి

Amit Shah : అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా- బీజేపీ మెనిఫెస్టో విడుదల ఆ రోజేనా!

Amit Shah Telangana Tour: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ 18 తేదీకి వాయిదా పడింది.

Telangana BJP Manifesto: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో 18 తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. 18వ తేదీ సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం నల్గొండ, వరంగల్‌, గద్వాల్‌, రాజేంద్రనగర్‌ సభల్లో అమిత్‌ షా పాల్గొంటారు. 

వాస్తవానికి తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు 17వ తేదీ ముహూర్తం ఫిక్స్ చేశారు. అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేయాలని బీజేపీ వర్గాలు భావించాయి. దీంతో బీజేపీ మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉంటాయన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. తెలంగాణలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే.. విద్య, వైద్యం ఉచితంగా అందించే హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. 

మేనిఫెస్టోలో ఏం ఉంటాయి
మేనిఫెస్టోలో జాబ్‌ క్యాలెండర్‌, ఉపాధి అవకాశాలపై హామీలు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పొందుపర్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసింది బీజేపీ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌ గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌ గా పేరు మార్చింది కేంద్రం. మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి ఉండటంతో అక్కడ ఆ పని సులువుగా జరిగింది. 

23 తరువాత తెలంగాణలో బీజేపీ నేతల మకాం
ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నవంబర్ 23వ తేదీతో ముగియనున్నాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలంతా తెలంగాణలో మకాం వేయనున్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తెలంగాణను చుట్టేశారు. మరోసారి.. నవంబర్ 25, 26, 27 తేదీల్లో వస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రచారానికి చివరి వారం కీలకంగా మారనుంది. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల తాకిడి రాష్ట్రానికి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.

నెలకోసారి పర్యటించిన అమిత్ షా
ఈ ఏడాది ప్రారంభం నుంచి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక ద‌ృష్టి సారించారు. ప్రతి నెలా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వచ్చిన ప్రతి సారి నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీ బలోపేతం అంశాలపై చర్చిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టేవారు. తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా దూకుడు పెంచారు. తెలంగాణలో వరుసగా పర్యటిస్తున్నారు. 

బీసీకి సీఎం పదవి
వాస్తవానికి అమిత్ షా ఇప్పటికే మరో సారి తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. గత అక్టోబర్‌లో సూర్యాపేట జిల్లాలో అమిత్ షా పర్యటించారు. సూర్యాపేటలో తలపెట్టిన జనగర్జన సభకు హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలిస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని చెప్పారు. మోదీ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.

రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం బీజేపీ పని చేస్తుందని అమిత్ షా అన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే ఆలోచిస్తాయని. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. పేద, దళిత వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి హామీని మర్చిపోయిన వ్యక్తి వ్యక్తి కేసీఆర్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget