అన్వేషించండి

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ విస్తృత ప్రచారం - మరోసారి బస్సు యాత్రకు ప్రియాంక, రాహుల్ !

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార వేగాన్ని పెంచుతోంది. రాహుల్, ప్రియాంక మరోసారి బస్సు యాత్ర చేపట్టనున్నారు.


Telangana Congress :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించుకుంది. 26వ తేదీన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంక గాంధీలు బస్సు యాత్ర నిర్వహించారు. కార్నర్ మీటింగ్‌లు , బహిరంగసభలు విజయవంతం కావడంతో  మరిన్ని సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 31న కొల్లాపూర్‌లో ‘పాలమూరి ప్రజాభేరి’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. నవంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ మరోమారు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్, ప్రియాంక రెండో విడత బస్సులో యాత్రలో పాల్గొననున్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ తోపాటు పార్టీ ఇంచార్జి థాక్రే కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో వీరంతా పర్యటించనున్నారు.  

ఇంటింటి ప్రచారానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు                                   

ఈ నెల 26,27 తేదీ లలో కాంగ్రెస్ నేతలు ఇంటింటికి ప్రచారానికి వెళ్లనున్నారు. ఈనెల 26న ఉమ్మడి వరంగల్ ,ఉమ్మడి నల్లగొండ ,హైదరాబాద్ లలో , 27న ఉమ్మడి రంగారెడ్డి , ఆదిలాబాద్, కరీంనగర్ ,మెదక్, నిజామాబాద్ లలో పర్యటన లు ఉండనున్నాయి. రెండు రోజుల్లో 40 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 10 మంది నేతలు రోజు కు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.ఇంఛార్జి ఠాక్రే ,రేవంత్ రెడ్డి, భట్టి ,ఉత్తమ్ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ ,శ్రీధర్ బాబు, మధుయాష్కీ, సీతక్క డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయనున్నారు.

ప్రచార గడువు ముగిసే వరకూ అగ్రనేతల వరుస పర్యటనలు                             

రాహుల్, ప్రియాంక ఇద్దరూ పూర్తిస్థాయిలో తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని తమ భుజాల మీద వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పోలింగ్‌ టైం దగ్గరపడుతున్నప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టి సోనియాను ఆహ్వానించాలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒకసారి అధికారం ఇవ్వమని ఆమెతోనే అప్పీల్‌ చేయించాలన్న ప్లాన్‌ ఉన్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న టైంలో… తెలంగాణలో గెలిచి సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా అవసరం అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. 

అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశమే మొదటి అర్హత           

అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడలేదు. గెలుపు గుర్రం అనుకున్న ప్రతి ఒక్కరికీ పిలిచి మరీ టిక్కెట్లు ఇచ్చింది. నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరు అనుకున్న చోట బీఆర్ఎస్ నేతలను పిలిచి మరీ టిక్కెట్లు ఇస్తోంది. రెండో విడత ప్రకటించబోయే జాబితాలో.. పది మందికిపైగా వలస నేతలు ఉంటారని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వాళ్లే. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
OnePlus 13: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లుకేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
OnePlus 13: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
Free Gas Cylinder Scheme: శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
శ్రీకాకుళం జిల్లాలోని పేద మహిళ ఇంట్లో టీ చేసిన చంద్రబాబు --బిల్ చెల్లించాలని రామ్మోహన్‌తో చమత్కారం
Singham Again Review - 'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
'సింగం ఎగైన్' రివ్యూ: ఇది పోలీస్ స్టోరీ కాదు... రోహిత్ శెట్టి రామాయణం - సినిమాగా ఎలా ఉందంటే?
Liquor Price Hike: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్! త్వరలో మద్యం ధరల పెంపు
Embed widget