అన్వేషించండి

Telangana: జీవో 46 రద్దుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం, కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు!

జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana CM Revanth Reddy: హైదరాబాద్‌: జీవో 46 రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పోలీసుశాఖ నియామకాల్లో ఈ జీవో రద్దు అంశం వివాదాస్పదంగా మారింది. భవిష్యత్‌లో జారీచేసే నోటిఫికేషన్లకు జీవో 46 (GO 46) అమలు చేయాలా? లేక రద్దు చేయాలా? అనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో చర్చించాక దీనిపై ప్రకటన చేస్తామన్నారు.

ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో రేవంత్ చర్చలు 
జీవో 46పై ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి చర్చించారు. గత ప్రభుత్వం మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు, కొత్త పోస్టుల నోటిఫికేషన్ పై చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అక్టోబర్ 4, 2023కు ముందు 15,750 పోస్టులకు సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయింది. దాంతో పోలీసు శాఖలో సెలక్ట్ అయిన 15,750 మందికి నియామక పత్రాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని అధికారులు సీఎం రేవంత్ కు తెలిపారు. నియామక ప్రక్రియ పూర్తయింది కనుక.. ఇప్పుడు జీవో 46 రద్దు చేయడం కొత్త వివాదాలకు తెరదీస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇవ్వబోయే నోటిఫికేషన్లకు ఈ జీవో రద్దును అమలు చేయడం ఉత్తమమని సూచించారు.

జీవో 46ను జారీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..
కొన్ని శాఖలకు జిల్లాలవారీగా యూనిట్లు లేకపోవడంతో జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయిస్తూ 2022 ఏప్రిల్‌ 4న బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 46ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు 53శాతం ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. మిగతా 27 పోలీసు యూనిట్లలో 47 శాతం పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనిపై గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగియవచ్చింది. దాంతో 15,750 పోస్టులకు ఎంపిక అయిన వారికి నియామక పత్రాలు ఇవ్వడమే సరైనదని సీఎం రేవంత్ కు అధికారులు సూచించారు. ఇటీవల హైకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా.. నేరుగా హైకోర్టు తీర్పు అమలు చేస్తే న్యాయపరంగా కొత్త సమస్యలు రావని అడ్వకేట్ జనరల్, అదనపు ఏజీ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఈ సమావేశంలో కొందరు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ
హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్.. సూడాన్ పౌరుడి రిపోర్ట్ నెగెటివ్! రెండో కేసుపై ఉత్కంఠ

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget